బర్త్ డే స్పెషల్: కట్టప్ప పుట్టిన రోజు నేడు

October 03, 2015 | 03:50 PM | 4 Views
ప్రింట్ కామెంట్
Sathyaraj-Kattappa-birthday-special-niharonline

బాహుబలి సినిమాలో తన విలక్షణ నటనతో  విమర్శకుల ప్రశంసలందుకున్న తమిళ నటుడు సత్యరాజ్ (కట్టప్ప) పుట్టిన రోజు నేడు. నేటితో ఆయన 61 సంవత్సరాలు పూర్తి చేసుకుని 62 లో అడుగు పెడుతున్నారు.

సత్య రాజ్ అసలు పేరు రంగ రాజన్. స్టేజ్ యాక్టర్ గా తన పేరును మార్చుకున్నాడు. ఈయన కెరీర్ ప్రారంభంలో అన్నీ విలన్ రోల్స్ ఎక్కువగా చేశాడు. ఆ కర్కష విలన్ ఇంత కరుణ చూపించగలడా అన్నట్టు కొన్ని సినిమాల్లో చాలా ఉదాత్తమైన పాత్రలు వేసి మెప్పించాడు సత్య రాజ్. మొదట విలన్ గా ఎంట్రీ ఇచ్చినా ఆ తరువాత ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా మారి కొన్ని సినిమాలు చేశాడు. ఆయన 1995లో ‘విలద్దీ విలన్’ అనే సినిమాకు దర్శకత్వం వహించి తానే మూడు విభిన్న పాత్రలో నటించి మెప్పించాడు. సినిమా నటుడిగానే కాక కొన్ని సామాజిక సమస్యలపై స్పందించే సోషల్ యాక్టివిస్ట్ గా (శ్రీలంక తమిళ నేషనలిజమ్, తమిళ నాడు నీటి హక్కు)కూడా పేరుంది. ఈయన కుమారుడు శిభిరాజ్ కూడా తమిళంలో హీరోగా చేస్తున్నాడు. 
తెలుగులో మిర్చి, శంఖం సినిమాల్లో హీరోకు తండ్రిగా నటించాడు. అంతకు ముందు కొన్ని తమిళ డబ్బింగ్ సినిమాల్లో ఈయన ముఖం అందరికీ పరిచయమే. ఆత్మ బంధువు సినిమాలో ఈయన విలనీ చూస్తే ఇప్పటికీ చాలా మందికి ఒళ్ళు గగుర్పొడుస్తుంది.
 తెలుగులోనూ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాల్లో చేసిన ఈయన బాహుబలిలో నటించిన కట్టప్ప పాత్రలో అంతులేని ప్రశంసలు అందుకున్నారు. తమిళంలో హీరోగా ఎన్నో సినిమాలు చేసిన సత్యరాజ్  బాహుబలి  2 సినిమా కోసం.. తమిళంలో విజయ్  సినిమాలోని విలన్ పాత్రను కాదనుకున్నాడట.

 తమిళంలో ఎంట్రీ ఇచ్చినప్పుడు కత్తి యుద్ధాల సినిమాలు బాగా రావడంతో అలాంటి పాత్రల కోసం ఈయన కత్తి యుద్ధం నేర్చుకున్నాడట. కానీ ఆ తరువాత ఆయనకు కత్తి యుద్ధం చేసే ఛాన్స్ ఒక్క సినిమాలో కూడా రాలేదన్నాడు. ఈ 60 ఏళ్ళ వయసులో బాహుబలి సినిమాలో కత్తి యుద్ధం చేసే అవకాశం రావడం తన అదృష్టం అని చెప్పాడు ఓ సందర్భంలో. 
కాగా టాలీవుడ్ రికార్డులను తిరగరాస్తున్న ప్రతిష్టాత్మక సినిమా బాహుబలి   సీక్వెల్ గా  తెరకెక్కుతున్న  బాహుబలి 2 లో  కట్టప్ప పాత్ర కీలకంగా మారింది.  కట్టప్ప బాహుబలిని  ఎందుకు, ఎలా హత్య చేశాడు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.  ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక కథనాలు కూడా  ప్రచారంలో ఉన్నాయి. బాహుబలి కట్టప్పగా తెలుగు వారి మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన సత్యరాజ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు నీహార్ ఆన్ లైన్ శుభాకాంక్షలు తెలుపుతోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ