స్వయంవరంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి లయ గుర్తుందా? మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సాధించి అనంతికాలంలోనే టాప్ హీరోయిన్ ఎదిగింది. తెలుగుతోపాటు తమిళంలోనూ ఆమె దాదాపు అగ్రహీరోలందరితోనూ నటించింది. అయితే 2006 లో ఓ డాక్టర్ ను పెళ్లిచేసుకున్న ఆమె నటనకు గుడ్ బై చెప్పి అమెరికాకు వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయ్యారు.
తాజాగా సోమవారం ఆమె ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయ్యిందని సమాచారం. ఈ ప్రమాదంలో ఆమెకు గాయలయినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారట. ఓ చిన్నపాటి శస్త్ర చికిత్స జరిగినట్లు సమాచారం. దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది. 2008 లో లయ ఓ పాపకు జన్మనిచ్చింది తనకు శ్లోక అనే పేరు పెట్టింది. స్వయంవరం, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, టాటా బిర్లా మధ్యలో లైలా, మిస్సమ్మ వంటి హిట్ మూవీస్ లో నటించింది. బాలకృష్ణతో విజయేంద్ర వర్మ, తమిళ నటుడు విజయ్ కాంత్ తో గజేంద్ర(తెలుగులో సింహాద్రి) చిత్రంలో జోడి కట్టింది.