లంచం తీసుకుంటూ దొరికిపోయిన సెన్సార్ ఆఫీసర్

June 27, 2015 | 12:20 PM | 1 Views
ప్రింట్ కామెంట్
sensor_board_officer_srinivas_niharonline

ఇక్కడ కూడా లంచాలకు అలవాటు పడ్డారంటే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఇంతవరకూ జారీ చేసిన సర్టిఫికెట్లు కూడా నిజమా కాదా అన్న అనుమానం కలుగుతుంది. సెన్సార్ ఆఫీసర్ శ్రీనివాసరావు శుక్రవారం లంచం తీసుకుంటూ పట్టుబడడంతో ఇప్పుడు సెన్సార్ సర్టిఫికెట్లకు కూడా విలువ ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తోంది.  ‘అందాల చందమామ' అనే సినిమా ‘యూ' సర్టిఫికెట్ ఇచ్చేందుకు అధికారి శ్రీనివాసరావు రూ. లక్ష డిమాండ్ చేసాడు. దీంతో ఆ చిత్ర నిర్మాత ప్రసాద్ రెడ్డి సీబీఐని ఆశ్రయించారు. నిర్మాత ప్రసాద్ రెడ్డి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు టాలీవుడ్ సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారి నిర్మాత వద్ద నుండి శుక్రవారం రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా రెండ్ హాండెడ్ గా పట్టుకున్నారు. తెలుగు సినీ చరిత్రలో సెన్సార్ బోర్డు అధికారిని లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం ఇదే తొలిసారి. దీన్ని బట్టి సినిమాలకు ఇచ్చే సర్టిఫికెట్ల విషయంలో కూడా అవినీతి రాజ్యమేలుతుందనే విషయం స్పష్టమవుతోంది. మధులగ్న దాస్, ఐశ్వర్య, రమన్ లాల్ ప్రధాన పాత్రల్లో కె.ఎస్.మూర్తి దర్శకత్వంలో పి.డి.ఆర్.ప్రసాద్ రెడ్డి నిర్మించిన సినిమా 'అందాల చందమామ'. ఓ మహిళకు అన్యాయం జరిగినప్పుడు భయపడకుండా దైర్యంగా ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడం గురించి ఈ సినిమాలో చూపించామని ఈ చిత్ర నిర్మాత ప్రసాదరెడ్డి చెప్పారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ