మన హీరోయిన్లు ఎంత ఎత్తుకు ఎదిగారంటే...

December 30, 2015 | 04:41 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Tollywood-top-actress-original-hights-niharonline

మనిషిని ఎదుటి వారిలో ఆకర్షించే వాటిలో ఎత్తు కూడా ఒకటి. ముఖ్యంగా నటీనటులకు ఈ హైటే ఛాన్సులు తెప్పించటంలో కీలకపాత్ర వహిస్తుంది. మరీ ముఖ్యంగా నటీమణుల విషయంలో. శరీర సిరులు ఎలా ఉన్నప్పటికీ తమ ఎత్తుతో ఆకర్షణీయంగా ఉండి, అవకాశాలు అందిపుచ్చుకోవటంలో టాలీవుడ్ హీరోయిన్లు ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వారి హైట్ల వివరాలకి వస్తే మీకోసం ఇక్కడ కొందరివీ ఇంచులతో సహా...

సమంత – 5 అడుగుల 5 అంగుళాలు  ఇప్పుడున్న హీరోయిన్లలో సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్న హీరోయిన్ సమంతనే. (కోలీవుడ్ లో కాదు లేండి). ఏం మాయ చేశావే మొదలు... సన్నాఫ్ సత్యమూర్తి వరకు ఒకటి రెండు తప్పా దాదాపు కెరీర్ లో అన్ని హిట్లే ఉన్నాయి. పెద్ద ఫిగర్ ఏం కాకపోయినప్పటికీ స్టార్ హీరోల పక్కన సైతం ఫర్ ఫెక్ట్ గా సూటయిపోవటమే కాదు, పాత్రలో జీవించేస్తూ 30 కి దగ్గరగా వస్తున్న చబ్బీ యాక్టింగ్ తో ఇంకా ఆఫర్లతో దూసుకెళ్లిపోతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్టులే దీనికి నిదర్శనం.

కాజల్ అగర్వాల్-5 అడుగుల 4 అంగుళాలు. పెద్ద హైట్ కాకపోయినప్పటికీ హాట్ ఫీచర్స్ తో  దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించేసిన ఈ భామ తిరిగి మళ్లీ వారితో జత కట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఆఫర్లు తగ్గినప్పటికీ ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ఆచీ తూచీ కెరీర్ ను మలుచుకుంటుందీ హాట్ చందమామ.

రకుల్ ప్రీత్ సింగ్ – 5అడుగుల 6 అంగుళాలు. సమంత లాగా ఒక్క సినిమాతో స్టార్ డమ్ కొట్టేసిన రకుల్ ప్రస్తుతం టాప్ హీరోల ఫేవరెట్ హీరోయిన్. కాస్త పొడగరి అయినప్పటికీ అందరి హీరోలతో వరసు ఆఫర్లతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం సక్సెస్ రేట్ తక్కువగా ఉన్నప్పటికీ త్వరలో పెద్దహిట్లతో ఫాంలోకి వస్తానన్న ఆశాభావం వ్యక్తం చేస్తుందీ ఢిల్లీ భామ.

నిత్య మీనన్-5 అడుగుల 2 అంగుళాలు పొట్టిదైనప్పటికీ గట్టిగానే హిట్లు కొడుతుంది. సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ నిత్య ఉందంటే సినిమా ష్యూర్ హిట్ అన్న రేంజ్ కి ఎదిగిపోయింది. ప్రస్తుతం సౌత్ లోని అన్ని భాషల్లో నిత్య మీనన్ టాప్ అండ్ ఫేవరెట్ హీరోయిన్ అంటే అతిశయోక్తి కాదు.  హైట్ తో సంబంధం లేకుండా అందరు హీరోయిన్లు ఆమెనే ఎంచుకోవటం క్రేజ్ కి నిదర్శనం.

అనుష్క శెట్టి-5 అడుగుల 8 అంగుళాలు.  సౌత్ లో ఇప్పుడున్న టాప్ హీరోయిన్లలో పొడగరి హీరోయిన్. సెకండ్ లీడ్ గా కెరీర్ ప్రారంభించిన అనుష్క ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ గా పాపులర్ అవుతుంది. సినిమాల కోసం హీరోలేనా ప్రయోగాలు చేసేది తానేం తీసిపోనని వెనకాడకుండా శరరీరాన్ని కష్టపెట్టుకంది. హైట్ వల్ల కుర్రహీరోలతో తక్కువగా నటించినప్పటికీ పొడగరి హీరోలైన మహేష్, ప్రభాస్, గోపీచంద్ లాంటి వారితో బాగానే రొమాన్స్ చేసింది. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీ బిజీగా ఉంది.

తమన్నా భాటియా-5 అడుగుల 5 అంగుళాలు.  మిల్కీ బ్యూటీ గా పేరొందిన తమన్నా పేరు బాహుబలిలో అవంతికగా ప్రపంచమంతా మార్మోగిపోయింది. హైట్ తక్కువ అయితేనేం డాన్స్ లో ఈ పాల సొగసుల సుందరిని బీట్ చేసే వారు లేకపోయారు. హీరో ఎవరైనా సరే వారి పక్కన సరిగ్గా అతుక్కుపోవటం ఈమె సొంతం. డాన్సింగ్ స్టార్ లైన అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి వారితో సమానంగా మాస్, క్లాస్ స్టెప్పులతో ఇరగదీసే తమన్నా కెరీర్ కొంతకాలంగా నత్తనడకన సాగింది. అయితే బాహుబలి తెచ్చిన పునర్ వైభవంతో తిరిగి టాప్ హీరోయిన్ జాబితాలోకి వచ్చి చేరటంతోపాటు పలు అవకాశాలను కట్టబెడుతోంది.

శృతీ హాసన్-5 అడుగుల 6 అంగుళాలు కమల్ గారాల తనయగా కెరీర్ ను ప్రారంభించిన శృతీకి కెరీర్ మొదట్లో పరాజయాలే పలకరించాయి. అయితే గబ్బర్ సింగ్ ఇచ్చిన లైఫ్ తో ప్రస్తుతం ఆమె ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ మరోవైపు బాలీవుడ్ లో బిజీ హీరోయిన్. కాస్త పొడగైన హీరోల పక్కన సరిగ్గా సరిపోయే పర్సనాలిటీ శృతీ సొంతం. నాజూకైన బాడీతో డాన్సుల్లో సైతం ఇరగదీస్తూ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా మారింది.

నయనతార-5 అడుగుల 1 అంగుళం. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోయిన్లలో నయన్ ఒకరు. కెరీర్ మొదట్లోనే వెంకీ, నాగ్ లాంటి అగ్ర హీరోలతో జత కట్టిన నయనతార ఇప్పుడు సెలక్టివ్ మూవీస్ తో దూసుకెళ్లిపోతుంది. ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్లలో హైట్ తక్కువ హీరోయిన్ నయన్ కావటం విశేషం. అయినా పొడగరి, పొట్టి, కుర్ర, సీనియర్ అన్న తేడా లేకుండా ఆల్ మోస్ట్ అందరు హీరోలతో సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా బిజీగా ఉంది.  

హన్సిక మోత్వానీ-5 అడుగుల 4 అంగుళాలు. టాలీవుడ్ లో ఒకప్పుడు మోస్ట్ బిజీ హీరోయిన్. స్టార్ హీరోలతో జోడీ కట్టింది.  అయితే రాను రాను  హన్సికకు ఆఫర్లు తగ్గిపోయాయి దాంతో సినిమాలు తగ్గిపోయాయి. అయితేనేం బొద్దుగా ఉండటంతో కోలీవుడ్ ప్రేక్షకులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. జూనియర్ కుష్బూ అంటూ ఏకంగా గుళ్లు కట్టేశారు. హీరోలు ఎవరైనా తమ సినిమాలో హన్సిక ఉంటే ఆటోమేటిక్ గా జనాలు వచ్చేస్తారన్న నమ్మకంతో ఎంత రెమ్యునరేషన్ ఇచ్చైనా సరే ఆమెను హీరోయిన్ గా పెట్టేసుకుంటున్నారు. తెలుగులో కూడా అడపాదడపా సినిమాలతో సందడి చేస్తూ సక్సెస్ లతో దూసుకెళ్తుందీ ముద్దు గుమ్మ.

టాలీవుడ్‌‌లో ఇప్పుడు కొందరు హీరోయిన్ల ఒడ్డూ.. పొడవూ హాట్ టాపిక్. ఎవరెంత అన్నది ఆధారంగానే హీరోల పక్కన వారు సూటవుతారా అన్నది చూసుకుంటున్నారు దర్శకులు. పోరపాటున కాంబినేషన్ తేడా కొట్టేస్తే మొదటికే తేడా వచ్చే ప్రమాదం ఉంది. దీంతో జాగ్రత్తగా హీరోయిన్లను ఎంచేసుకుంటున్నారు. ఒడ్డు పొడుగుతోపాటు నటన కూడా ముఖ్యమే కదా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ