దేవి శ్రీ ప్రసాద్, టాలీవుడ్ ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ యువకెరటం బాణీలు ఉంటే చాలు ఆ చిత్రం ఖచ్ఛితంగా హిట్ అవుతుందని పేరుండేది. అందుకే దర్శకులు హీరోలతో గొడవలు పడి మరీ ఆయన్ని పెట్టుకునే వారు. కానీ పరిస్థితి మారింది. ఓడలు బండ్లు అయిన చందాగా మారింది దేవీ పరిస్థితి. ప్రస్తుతం దేవీ చేతిలో వేళ్ల మీద లెక్కపెట్టుకునే సినిమాలు కూడా లేవు. మరి దేవీ చేసిన పాపమేంటి... దీనికి కారణాలు బోలెడు. క్వాలిటీ పేరిట నిర్మాతల నుంచి రెమ్యునరేషన్ బాగా దంచుతాడని, టైంకి ట్యూన్స్ అందివ్వడని అతనిపై విమర్శలు ఉన్నాయి. టాప్ డైరక్టర్లతో కూడా అతని ప్రవర్తన కారణంగానే ఆఫర్లు తగ్గిపోతున్నాయని కూడా ఆ మధ్య వార్తలు విన వచ్చాయి.
ఆ మధ్య బోయపాటితో లెజెండ్ ఆడియో పంక్షన్లో జరిగిందే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఆడియో పంక్షన్ వేదికగానే ఏం లేదంటూనే ఇద్దరు బహిరంగంగా విమర్శలు చేసుకున్నారు. మరో టాప్ డైరక్టర్ వివి.వినాయక్ తో కూడా అల్లుడు శీను టైంలో గొడవలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీంతో వినాయక్ తన నెక్స్ట్ కి థమన్ ని తీసుకున్నాడని టాక్. మరో దర్శకుడు శీనువైట్ల కూడా దేవీ తో రిలేషన్ కట్ అయిన కారణంగానే అనిరుధ్ ని రాంచరణ్ సినిమాకి తీసుకున్నాడని సమాచారం. చివరకి త్రివిక్రమ్ కూడా దేవీ ని పక్కన బెట్టి నితిన్ తో సినిమాకి అనిరుధ్ కి అవకాశం ఇస్తున్నాడని ఫిలింనగర్ లో న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఛాన్స్ లు తగ్గిపోవటంతో కోలీవుడ్, శాండల్ వుడ్ ను దేవీ ఆశ్రయిస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో శ్రీమంతుడు విడుదలకు సిద్ధంగా ఉండగా, జూనియర్ సుకుమార్ ల మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇవి తప్ప దేవీ కి మరే చిత్రాల్లో ఆఫర్లు లేవు. బద్ధకంతోపాటు అతను చేసే అతితో కూడా టాప్ డైరెక్టర్స్ దేవీతో వర్క్ చేయడానికి అంతగా ఆసక్తి చూపడంలేదన్నది టాలీవుడ్ టాక్. ఇప్పటికైనా దేవీ ఆటిట్యూడ్ మార్చుకుని సరిగ్గా మసలుకుంటే మంచిదని సినీ పెద్దలు సూచిస్తున్నారు.