అవకాశాలు సన్నగిల్లిన త్రిషకు ఇప్పుడు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం గిరిధర్ మామిడిపల్లి నిర్మిస్తోన్న నాయకి అనే హర్రర్ కామెడి చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా కోసం కాలేజ్ చదివే అమ్మాయిలా కూడా కనపడాల్సి ఉండటంతో త్రిష వెయిట్ తగ్గే ప్రయత్నం చేస్తుందట. అందుకోసమే ఈ సినిమా షూటింగ్ గ్యాప్ తీసుకుని చేస్తుందట. అలాగే అదే పాత్ర కోసం వెయిట్ పెరగాల్సి కూడా ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. గోవి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో త్రిష డబుల్ షేడ్ ఉన్న పాత్రలో కనపించనుంది. అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క కూడా జీరో సైజ్ కోసం దాదాపు పదిహేను కిలోల బరువు పెరిగింది. మళ్లీ సన్నబడే ప్రయత్నాలు చేస్తుంది. మొత్తం మీద ఈ వ్యవహరం అంతా చూస్తుంటే అనుష్కను త్రిష ఫాలో అవుతుందేమోనని అనిపిస్తుంది.