బర్త్ డే స్పెషల్ : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్

November 07, 2015 | 03:23 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Trivikram-Srinivas-birthday-special-niharonline

పలుకే బంగారామాయేనా... మాటలు ముత్యాలు ఇవి సాధారణంగా మనం వింటూ ఉంటాం. కానీ, ఆయన కలం నుంచి జాలువారే మాటలకు మాత్రం కాసుల వర్షం కురుస్తుంది. ప్రతి డైలాగ్ కి ఓ పంచ్ తుటాలా పేలుతాయి. నవ్వు తెప్పిస్తాయి. సీరియస్ గా ఆలోచింపజేస్తాయి. కలవరపరుస్తాయి. ఆయనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా నీహార్ ఆన్ లైన్ ఆయన గురించి...

త్రివిక్రమ్ అసలు పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస్. భీమవరం లో 1971 నవంబర్ 7న జన్మించాడు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. నటుడు సునీల్ ఈయన ఒకే కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. త్రివిక్రమ్ మొదట్లో స్కూల్ టీచర్ గా పనిచేశారు. ఆ తర్వాత సునీల్ కలిసి హైదరాబాద్ కు చేరి ఇండస్ట్రీ లో చాన్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. మొదట్లో రోడ్ అనే ఓ సీరియల్ రాశారు. అది ప్రముఖ వార పత్రికలో ప్రచురితమైంది కూడా. ఆ తర్వాత నటుడు, రచయిత పోసాని దగ్గర 18 నెలలపాటు అసిస్టెంట్ గా చేరాడు. ఆ టైం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. అసలు త్రివిక్రమ్ డైలాగులు రాయాలన్న ఆలోచన మొదట్లో అసలు ఉండేది కాదట. ఆ తర్వాత ఎడిటర్ గౌతంరాజు గారి పరిచయంతో దర్శకుడు విజయ్ భాస్కర్ కి దగ్గర కావటం, ఆపై స్వయంవరంకి మాటలు రాయటం చకచకా జరిగిపోయాయి. అలా రైటర్ గా త్రివిక్రమ్ ప్రస్థానం మొదలైంది.

ఆపై నువ్వేకావాలి, నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మథుడు ఇలా వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ హిట్లే అయ్యాయి. ఆ సినిమాలు, వాటిల్లోని డైలాగులు ఇప్పటికీ మన పెదవుల కింద తచ్చాడుతుంటాయి. ఆపై నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడిగా మారి తన సత్తా చాటాడు. తర్వాత మహేష్ బాబులోని కోణాన్ని ఆవిష్కరిస్తూ అతడు తీశాడు. ఆపై పవర్ స్టార్ తో జల్సా కానిచ్చాడు. ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి ఇలా ప్రతీ దాంట్లో మానవీయ కోణాన్ని సృషిస్తూ తన సినీ జర్నీ సాగిస్తున్నాడు. సినిమా ఏదైనా, సబ్జెక్ట్ ఎలాంటిదైనా అందులో పంచ్ లు, వెతకారాలకు మాత్రం కొదవ ఉండదు. షార్ట్ అండ్ స్వీట్ డైలాగులే కాదు, భారీ డైలాగులు... అందులో వేదాంతాలు త్రివిక్రమ్ సొంతం. మనసు లోని భావాలను తెరకెక్కించటంలో త్రివిక్రమ్ ది ఓ ప్రత్యేక శైలి. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరిన్నీ జరుపుకోవాలని ఆశిస్తూ హ్యాపీ బర్త్ డే టూ త్రివిక్రమ్ సర్.     

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ