చిరంజీవితో పాటు చెన్నయ్ (అప్పుడు మద్రాసు)లో యాక్టింగ్ కోర్సు చేసిన టీంలో కమెడియన్ సుధాకర్, నారాయణ, టీవీ సీరియల్ ఆర్టిస్టు స్వర్గీయ హరి ప్రసాద్ లు ఉన్నారు. వీరందరూ సినీ పరిశ్రమలోకి ఒకేసారి అడుగు పెట్టారు. అయితే నలుగురిలో బాగా క్లిక్కయిన నటుడు చిరంజీవి అనేది అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో హరి ప్రసాద్, సుధాకర్ కలిసి ‘డైనమిక్ మూవీ మేకర్స్’ అనే ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశారు. వారి మొదటి ప్రాజెక్టులో మేగా స్టార్ చిరంజీవితో తీసిన సినిమా ‘యముడికి మొగుడు’. ఈ చిత్రం 1988లో రిలీజైన బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమాకు అప్పట్లో ఒక కోటి 20 లక్షలు ఖర్చు చేశారట. అంటే అప్పుడది చాలా ఎక్కువ బడ్జెట్ తో తీసిన చిత్రంగా చెప్పుకోవాలి. ఈ చిత్రాన్ని చాలా రిచ్ సెట్టింగ్స్, కాస్టూమ్స్, రిస్కీ ఫైట్లతో చిత్రీకరించారట. ఆ తరువాత మరెందుకో గానీ ఈ ముగ్గురు స్నేహితులు ఆ బేనర్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఈ చిత్రం మాత్రం ఈ స్నేహితులకు తీపి గుర్తుగా మిగిలిపోయింది. ఈ విషయమే నారాయణ మాట్లాడుతూ...‘‘ఇది తమ స్నేహానికి పెద్ద కానుక. ప్రత్యేకంగా చిరంజీవికి. అప్పడు ఆయనే తమకు ఈ సలహా ఇచ్చి మేము ఆర్థికంగా నిలదొక్కుకోడానికి చేయూతనిచ్చారు’’ అన్నాడు.
ఏప్రిల్ 29 న చిరంజీవి యముడికి మొగుడు రిలీజైంది. అంటే ఆ చిత్రం రిలీజై నేటికి 27 ఏళ్ళు పూర్తి చేసుకుంది.