‘కామోషీ(యా)’ గా పేలిన సెక్స్ బాంబ్

February 07, 2015 | 12:52 PM | 46 Views
ప్రింట్ కామెంట్
sapna_pabby_khamoshia_niharonline

డైరెక్ట్ గా వెండి తెర అవకాశాలు రాని వారికి బుల్లితెర మంచి వేదికవుతోంది. బుల్లి తెరమీద ఓ వెలుగు వెలిగారంటే వెండితర అవకాశాలు వాటంతటవే వచ్చిపడతాయి. అలాంటిదే జరిగింది బ్రిటన్‌కి చెందిన మోడల్‌ సప్నా పబ్బి విషయంలో. ఈ అమ్మడు ముందుగా '24' అనే ఇండియన్‌ టెలివిజన్‌ సిరీస్‌లో నటించింది. ఇంత అందమైన అమ్మాయి బుల్లితెర తెర మీద ఎలా? అనుకున్నారు బాలీవుడ్‌ ప్రముఖులు. ఇంకే ముంది చాలా మంది ప్రముఖుల దృష్టిలో పడిపోయింది. బుల్లితెరపై గాట్టిగా పేలిన ఈ సెక్స్‌ బాంబు. ఇక బాలీవుడ్ వెండితెరపై పేలేందుకు ఎంతో సమయం పట్టలేదు. ఈ అమ్మడు ఇంకొన్ని సీరియళ్ళలో అంగీకరించక ముందే బాలీవుడ్ సినిమాల్లోకి లాగేసారు. ‘కామోషియా’ అనే చిత్రంతో తొలి సంతకం చేసేసింది సప్న పబ్బి. ఇలా ఎంట్రీ ఇచ్చిందో లేదో, మిగిలిన సెక్సీ భామలంతా తమకు పోటీ అయిపోతోందని భయపడుతున్నారట. మొదట మోడల్ గా అడుగు పెట్టిన ఈ భామ ’అందాలు ఆరబోయాలంటే పోర్న్‌ క్వీన్‌ కానక్కర్లేదనీ, ఇండియన్‌ సెన్సార్‌ నిబంధనలకి లోబడి సన్నీకి మించి చూపించవచ్చునని’బబ్బీ ఇప్పటికే చెప్పేసిందట. ఇంకేముంది తన మాటలను నిజం చేస్తూ ఓ పత్రిక కోసం దిమ్మతిరిగే ఫోటో షూట్‌ కూడా చేసేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ