శ్రీమంతుడు కొత్త కాన్సెప్ట్ తో రావడం... రొటీన్ గా వస్తున్న సినిమాలకు భిన్నంగా ఉండడంతో... దీనికి ప్రేక్షకాదరణ విపరీతంగా పెరుగుతోంది. దీంతో పాటు ఇండస్ట్రీలో కూడా సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా తోటివారితో, కుటుంబంతో, ఊరితో ఉండే సంబంధ బాంధవ్యాల గురించి హార్ట్ టచింగ్ గా చూపించారు ఈ సినిమాలో కొరటాల శివ. అయితే మహేష్ తనను ఇద్దరన్నయ్యలు శ్రీమంతుడి గురించి ప్రశంసించడం చాలా సర్ప్రైజింగ్ గా అనిపించిందంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకూ మహేష్ కు రమేష్ ఒక్కడే కదా... అన్నయ్య... మరి ఈ రెండో అన్నయ్య ఎవరూ అనుకుంటున్నారు కదా... ఇంకెవరండీ సినిమా అన్నయ్య పెద్దోడంట (వెంకీ). సీతమ్మ వాకిట్లో సినిమాతో వీరి అనుబంధం మరింత పెరిగిపోయింది. సినిమా చూడగానే వెంకటేష్ ఎక్కడున్నావ్ అని ఫోన్లో అడిగి, ఇంట్లో ఉన్నట్లు తెలుసుకొని, నేరుగా ఇంటికి వెళ్ళి అభినందించడం మహేష్ కు చాలా ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ అనిపించిందట. ఇక అన్నయ్య రమేష్ ఎప్పుడూ లేనిది ఈ సినిమా చూసి పెద్ద బొకేతో ఇంటికి వచ్చాడట. ఇది కూడా మహేష్ ను సర్ప్రైజ్ కు గురి చేసిందట. ఇక సినిమా చూసి నాన్నగారూ కృష్ణ... ఇది నీ కెరీర్ లోనే బెస్ట్ సినిమా అని ప్రశంసించగానే మహేష్ కు కన్నీళ్చొచ్చేశాయట. సినిమా విడుదలకు ముందు కంటి మీద కునుకులేదట మహేష్ కు... ఇప్పుడు ప్రశంసలతో ఆనందంతో నిద్దర్రావడం లేదని చెపుతున్నాడు. ఈ విషయాలన్నీ సక్సెస్ మీట్ లో చెప్పుకొస్తున్నాడు మహేష్. శ్రీమంతుడు సక్సెస్ బాగా ఎంజాయ్ చేసి బ్రహ్మోత్సవానికి సెప్టెంబర్ లో రెడీ అవుతున్నాడట మహేష్ బాబు.