పరిశ్రమ వర్గాల అంచనాలను మించి 2014 లో చిత్రీకరించిన తమిళ చిత్రం కాక్కముట్టై. సెప్టెంబర్ 5న 39వ టొరొంటో ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడి, రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది. నటుడు ధనుష్, దర్శకుడు వెట్రిమారన్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన చిత్రం కాక్కముట్టై. ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు మణి కంఠన్. మ్యూజిక్ అందించిన వారు జి.వి.ప్రకాష్ కుమార్, విఘ్నేష్, రమేష్ అనే బాలతారలతో పాటు వారి తల్లి, అమ్మమ్మలు ముఖ్య పాత్రలుగా నటించారు. అందరూ కొత్త వారే... చిత్రం కథలోకి వెళితే ఇద్దరు అన్నదమ్ములు అమ్మ, అమ్మమ్మలతో కలిసి జీవిస్తుంటారు. ఆ పిల్లలకు బొమ్మలు, టీవీ వంటి చిన్న చిన్న కోరికలను ఆ ఇద్దరు ఆడవాళ్ళు తీర్చలేరని తెలిసినా ఎప్పుడూ ఏవో కావాలని మారాం చేస్తుంటారు... ఓ పూట తిండి కోసం ఆరాటపడే పేద కుటుంబంలోని పిల్లలకు కలిగే కోరికలు... వాటిని వారికి ఇవ్వలేని నిస్సహాయతలో పెద్దలు... వారికి కోరిక తీర్చేందుకు పడే తాపత్రయం వంటి ఇతి వ్రుత్తంతో సాగుతుందీ సినిమా.... పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. చిత్రాన్ని జూన్ ఐదున తమిళంతో పాటు ఇతర దేశాల్లోనూ భారీ ఎత్తున విడుదల చేయడానికి ఫాక్స్ స్టార్ స్టూడియో సన్నాహాలు చేస్తోంది. జపాన్, సౌత్‌కొరియా, మలేషియా, సింగపూర్ దేశాల్లో కాక్కముట్టై విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.