కమల్ హాసన్ మొదటి భార్య కమల్ హాసన్ పై నిప్పులు చెరుగుతోంది . ఇన్నాళ్ళకు ఇదేమిటని అందరికీ అనిపిస్తుంది. దీనికి కారణం లేకపోలేదు. ఆమె ఇలా అగ్గిమీద గుగ్గిలం అవడానికి కారణం కమల్ హాసనే నట . ఇటీవల తన కూతురు శృతి హాసన్ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొని నా మొదటి భార్య వాణి తో విడిపోయిన సమయంలో సెటిల్ మెంట్ లో భాగంగా సర్వస్వం కోల్పోయినట్లు చెప్పుకున్నాడు. తను ఒక చిన్న ఇంటిలోకి మారాననీ, మనం ఇల్లు మారుతున్నాం అని శృతిలో అన్నప్పుడు. ఆ ఇంట్లో నువ్వు ఉంటావుకదా... అని శృతి అన్నదని చెప్పుకున్నాడు. అంటే తను వాణితో విడిపోవడం వల్ల ఉన్నదంతా పోగొట్టుకున్నానని మాట్లాడాడు. దాంతో ఈ విషయం వాణి గణపతి చెవిన పడటంతో ఆమె ఫైర్ అయిపోయింది. అసలు నాకు విడాకులు ఇచ్చినప్పుడు కమల్ దగ్గర ఏముందని... పైగా కమల్ అన్నయ్య చారు హాసన్ కుటుంబం కూడా పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నది నేనే ... నేను కమల్ తో ఉన్నప్పుడు ఉన్నది కూడా అద్దె ఇల్లు. అటువంటిది పెద్ద బ్యాంక్ బాలెన్స్ ఉన్నట్లు సర్వనాశనం అయ్యానని గొప్పలు చెప్పుకోవడం ఎందుకూ.... అంటూ మండిపడుతోంది మాజీ భార్య వాణి .