ఆ మధ్య ఓ స్కూలు కుర్రాడు, టీచర్ కు ఆకర్షితుడైన అదరగొట్టే పోస్టర్లతో వర్మ సావిత్రి అనే సినిమా ప్రాజెక్టు మొదలు పెట్టాడు. ఆ పోస్టర్లు చూసిన జనాలు ఇదేం సినిమా అంటూ విమర్శలు గుప్పించారు. టైటిల్ విషయంలో సావిత్రి అభిమానులు దుమ్మెత్తిపోశారు. దీంతో టైటిల్ ను శ్రీదేవిగా మార్చారు. అప్పుడు బోనీ కపూర్ నుంచి వర్మకు వార్నింగ్ వచ్చింది. ఆ తరువాత ఇక ఆ సినిమా గురించి మరి ఏ వార్తా రాలేదు. ఇక వదిలేసినట్టే అనుకున్నారంతా.
కానీ హడావుడి చేసేసిన శ్రీదేవి ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చేస్తోంది. అయితే ఈ చిత్రానికి ఇప్పుడు జేడీ చక్రవర్తి దర్శకత్వ వహిస్తారని సమాచారం. మధ్యలో కిరణ్ అనే కుర్రాడు సైలెంటుగా కొంత సినిమాని షూట్ చేశాడట. ఇప్పుడు జేడీ లైన్లోకి వచ్చాడని చెబుతున్నారు. మరి టైటిల్ విషయం ఏం చేస్తారో తెలియదు గానీ... సినిమా మాత్రం పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నాడట జేడీ చక్రవర్తి.