దేవుడినీ వదలని వర్మ

September 04, 2015 | 11:39 AM | 2 Views
ప్రింట్ కామెంట్
ramgopalvarma_turned_divotee_niharonline

దర్శకుడు వర్మ నాస్తికడున్న సంగతి అందరికీ తెలుసు. ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడీ విషయం. మరి ఇక్కడ కనిపిస్తున్న ఫొటో ఏంటీ? అంత వినయంగా వినాయకుడికి నమస్కరిస్తున్నాడు వర్మ. ఆస్తికుడైపోయాడా...? ఈ ఫొటో వర్మేనా?  ఛ... డౌటెందుకు ఆయనే... అని మంచు మనోజ్ ట్విట్టర్ లో చెప్పుకున్నాడు. ఇప్పుడు మంచు మనోజ్ నటిస్తున్న ‘ఎటాక్’ చిత్రం సెట్ లో వర్మ దేవుడిని మొక్కుతున్న ఫోటోను మనోజ్ తన కమెరాలో బంధించేసాడు. ఇప్పుడా ఫోటోతో పాటు‘రామ్ గోపాల్ వర్మ ను జయించిన దేవుడు’ అని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు మనోజ్. ఏమో మనోజ్ సరదాగా ఒక్క స్టిల్ అని ఉండవచ్చు... వర్మకూ సంచలన మాటలూ, చేతలూ చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఇలా ఓ స్టిల్ ఇచ్చి ఉండొచ్చు... ఏమో గుర్రం ఎగరా వచ్చు... వర్మ మొక్కనూ వచ్చు....
   అయితే ఈ ఫొటోకు పూరీ జగన్నాథ్ కామెంట్ ఏమిటంటే... ‘‘ఎందుకొచ్చావురా  నా గుడికి... ప్రశాంతంగా బతకనివ్వవా’’ అని వినాయకుడు అంటున్నట్టుగా పెట్టేశాడు...  మరి శిష్యుడేంటబ్బా ఇంతలా కామెంట్ చేశాడు ! 

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ