ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ ఇప్పుడు మూడో సినిమా షూటింగ్ లో బిజీ అయ్యాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లోఫర్ షూటింగ్ ఇప్పుడు జోద్పూర్ లో జరుగుతోంది. ‘ముకుంద’, ‘కంచె’ తర్వాత వరుణ్ తేజ నటిస్తున్న చిత్ర మిది. ఈ చిత్రం అప్పుడే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుని రాజస్థాన్ లోని. జోద్పూర్లో రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది. హీరో వరుణ్, హీరోయిన్ దిశా పటాని, మిగతా ముఖ్యతారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అక్కడే దాదాపు ఓ 20 రోజుల పాటు షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ పై సి. కళ్యాణ్ సమర్పణలో శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు.