బాహుబలి సినిమా చూడ్డానికి మధ్యలో మరొక్కరోజే టైమ్ ఉంది. ఈ సినిమా టికెట్ల కోసం ఎవరికి తోచిన ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కొత్త సినిమా విడుదలైతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు టికెట్లు ఈజీగా సంపాదించుకోవచ్చు. ఇక మీడియా వారికీ, జర్నలిస్టులకు కూడా టికెట్లు సంపాదించడం తేలికే... ఇదంతా ఒకప్పటి మాట... కానీ బాహుబలి చిత్రానికి వచ్చే సరికి అందరూ ఎంత ప్రయత్నం చేసినా కష్టంగానే ఉందంటున్నారు. ఇలా తమ గోడును ట్విట్టర్ లో వెళ్ళబోసుకున్నారు. ప్రముఖ రచయిత గోపీ మోహన్, కమెడియన్ వెన్నల కిషోర్. వీళ్ళిద్దరూ ఇండస్ట్రీలో పాతుకుపోయిన వారే... టికెట్లు ఇప్పించమని ఇండస్ట్రీలో ఉన్న వారిని సన్నిహితులు పోరు పెట్టడం మామూలే... అలా గోపీ మోహన్ ను బాగా వత్తిడి చేస్తున్నారట. అడిగారు కదా అని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడట ఈ స్టార్ రైటర్. కానీ అతని ప్రయత్నాలేవీ ఫలిలచడం లేదట. దీంతో ఈ మాత్రం కూడా చేయలేవా? అంటూ సెటైర్లు వేస్తున్నారట ఆయన మీద. తెలిసిన వాళ్ళందరి ఫోన్లూ బిజీ గా ఉండడంతో టికెట్లు దొరకలేదట. అలా గోపీ మోహన్ ట్వీట్ చేస్తే... ఆయన ట్వీట్ చూసి వెన్నెల కిషోర్ కూడా స్పందిస్తూ... బ్లాక్ లో ఎలాగోలా మేనేజ్ చేసి టికెట్లు సంపాదించాననీ, సింగిల్ కాల్తో టికెట్లు తెప్పించానని ఫామిలీ మెంబర్స్ దగ్గర బిల్డప్ ఇచ్చుకున్నానని చెపుతున్నాడు. బాహుబలి టికెట్ల కోసం పలుకుబడి కలిగిన ఇండస్ట్రీ వాళ్ళే ఇంత ఇబ్బంది పడుతుంటే... ఇక సామాన్య జనాల గురించి ఏం చెప్పగలం?