సీనియర్ సినిమాటోగ్రాఫర్,దర్శకుడు ఎ.విన్సెంట్ (14.6.1928-25.2.2015) చెన్నైయ్ లో బుధవారం ఉదయం 10.55 నిమిషాలకు మృతి చెందారు. ఆయన తమిళ తెలుగు, మళయాళం, హిందీ సినిమాలకు దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. మొదట మళయాళంలో ‘నీలక్కయుల్’ అనే సినిమాకు కెమెరామెన్ గా కెరీర్ ప్రారంభించారు. దర్శకత్వ శాఖలోకి అడుగు పెట్టింది మాత్రం ‘భార్గవి నిలయం’ సినిమా ద్వారా. 60 దశకంలో ఈయన 30 సినిమాలకు దర్శకత్వం వహించారు. సినీమాటోగ్రాఫర్ గా తెలుగులో చేసిన చివరి సినిమా అన్నమయ్య (1997). 1969లో ఉత్తమ దర్శకుడి అవార్డును కేరళ ప్రభుత్వం నుంచి ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు. 1974లో ప్రేమ్ నగర్ చిత్రానికి ఉత్తమ సినీమాటోగ్రాఫర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు. 1996, 2003లో ఇండియన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్ గా జె.సి.డానియల్ అవార్డును రాష్ట్ర గౌరవ పురస్కారంగా అందుకున్నారు.