పురస్కారాలను మించిన కానుక అందుకుందట....

June 23, 2015 | 05:56 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Vidya_Balan_special_gift_from_fan_niharonline

అంతకు ముందు ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తుంపు ఒక్క డర్టీ పిక్చర్ తో విద్యాబాలన్ కెరీర్ పీక్ స్టేజ్ కు చేరుకుంది. అప్పటి వరకూ సన్నగా నాజూగ్గా ఉన్న ఆమె ఆ సినిమా కోసం భారీగా ఒళ్ళు పెంచేసింది పాపం. ఇక ఆ సినిమా తరువాత చెప్పుకో దగ్గ సినిమాలేవీ రాలేదు. వచ్చినా అన్నీ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలే. విద్యాబాలన్ కెరీర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది. జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది. ముఖ్య మంత్రులు, ప్రధానుల నుండి కూడా ప్రశంసలు అందుకుంది. పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకుంది. అయినా ఇప్పుడు తను పొందిన గౌరవం ముందు అవన్నీ తక్కువే నంటోంది. ఈ నటికి ఈ మధ్యే ఒక అనుభవం ఎదురైందట. అదేమిటంటే ఓ టీనేజ్ ఫ్యాన్ ఏకంగా ఢిల్లీ నుంచి ముంబై వచ్చేసిందట. అంతే కాదు తన కోసం గేటు వద్ద ఒక పూటంతా నిలుచుందట. సెక్యూరిటీతో ఎలాగైనా బాలన్ని కలవాలని చెప్పిందట, తను తెచ్చిన బహుమతిని ఇవ్వాలని అలా విద్యాబాలన్ కోసం గేటు దగ్గర పడిగాపులు కాచిందట. ఇక విద్యాబాలన్ రానే వచ్చింది. తనను చూసి లోపలికి తీసుకు వెళ్ళిందట. ఓ గంట సమయాన్ని ఆమె కోసం కేటాయించిందట. ఆమె అందించిన ఆ కానుకను అందుకుని ఎంతో ఆనందించిందట. ఇంతకీ ఆమె ఇచ్చింది ఓ స్ర్కాప్ బుక్. అందులో బాలన్కి సంబంధించిన ఫొటోలు మాత్రమే అతికించి ఉన్నాయి. తన కెరీర్లో ఇప్పటి వరకూ చూడని ఇంతటి అభిమానానికి పొంగిపోయిందట విద్యా బాలన్. పద్మశ్రీ కంటే, యూనివర్శిటీ గౌరవాలకంటే గొప్పదైన పురస్కారమిది అని సంతోషించింది విద్యాబాలన్. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ