మా ఎన్నికలు ఫలితాలు వెలువడిన అనంతరం ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. అయితే నటుడు విజయచందర్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా నటుడు మురళీ మోహన్ కు వ్యతిరేకంగా వచ్చినవని అన్నారు. ఆయన మురళీ మోహన్ ను ఘాటుగా విమర్శాంచారు. ఈ ఎన్నికల్లో ఓటమి జయసుధది కాదనీ, మురళీ మోహన్ మాత్రమే నని అన్నారు. రాజేంద్రప్రసాద్ అధ్యక్ష పదవికోసం పోటీకీ దిగిన తర్వాత... చివరి సమయంలో జయసుధను మురళీమోహన్ ఈ అధ్యక్ష బరిలోకి దింపారని విజయ్ చందర్ పరోక్ష కామెంట్లు చేసారు. తాను ఎవరు పేరు చెబితే వారే పోటీచేయాలంటూ కలలు కన్న మురళీ మోహన్ కలలన్నీ కూడా అన్ని పటాపంచలయ్యాయని విజయ్ చందర్ అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సినిమా కళాకారులంతా ఒక్కటిగా వుండాలనుకుంటే.... ప్రస్తుతం ‘మా’ కార్యాలయాన్ని కూడా ఒక పార్టీ కార్యాలయంగా మార్చేసారంటూ ఆయన మండిపడ్డారు. అయితే రాజేంద్రప్రసాద్ తాను ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకొని, వాటిని నెరవేర్చాలని విజయ్ చందర్ కోరారు.