వందకోట్లు వచ్చినా ఎందుకు ఏడుపు?

April 23, 2016 | 12:14 PM | 2 Views
ప్రింట్ కామెంట్
theri-100-crore-club-but-fail-in-telugu-niharonline

ఒక సౌత్ సినిమా వందకోట్ల క్లబ్ లో చేరటం అంటే మాములు విషయం కాదు. హీరోలకు ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ బాలీవుడ్ చిత్రాల తరహాలో భారీగా మన చిత్రాలకు థియేటర్లు లభించవు. కానీ, కోలీవుడ్ స్టార్ల విషయంలో థియేటర్లు తక్కువగా విడుదల చేసిన వందకోట్ల మార్క్ ను అలవోకగా చేరుకుంటారు. లాంగ్ రన్ నడవటంతోపాటు, ఫ్యాన్స్ పుణ్యమాని పైరసీ లేకపోవటం కూడా అక్కడ కారణం లేండి. ఇక స్టార్ విజయ్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ తెలియంది కాదు. రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ అభిమానులు ఉన్న హీరో ఒక్క విజయే. అలాగే రజనీ తర్వాత వందకోట్ల మార్క్ చిత్రాన్ని అందించింది కూడా ఇదయదళపతినే.

తుపాకీ, కత్తి రెండు వందకోట్ల క్లబ్ లో చేరిన చిత్రాలే. తర్వాత వచ్చిన జిల్లా ఆ ఫీట్ ను సాధించలేకపోయింది. కానీ, భారీ అంచనాల మధ్య వచ్చిన పులి డిజాస్టర్ గా నిలిచింది. దీంతో తాజా చిత్రం తేరి  వందకోట్ల ఫీట్ ను అందుకుంటుందా అని అభిమానుల్లో గుబులు మొదలైంది. కానీ, అభిమానులు ఆశించినట్టుగానే అది ఆ ఫీట్ ను సాధించింది.

ఈ విషయాన్ని ఈ సినిమా నిర్మాత కలై పులి థాను స్వయంగా తెలియజేశారు. ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసినందుకు చాలా సంతోషంగా వుందని చెప్పారు. అయితే కోలీవుడ్లో ఇంతటి భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమా, తెలుగులో 'పోలీస్' పేరుతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినందుకే విజయ్ తెగ ఫీలవుతున్నాడని అంటున్నారు. గతంలో తుపాకీ తెలుగులో ఓ మాదిరిగా ఆడినప్పటికీ, సమంత, అమీ జాక్సన్ లను తెలుగులోనూ క్రేజ్ ఉండటం, పైగా రాజారాణి దర్శకుడు కావటంతో తెలుగులో హిట్ వస్తుందని ఆశించినప్పటికీ అది జరగలేదు. మరోవైపు భారీగా థియేటర్లతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసిన దిల్ రాజు కూడా నష్టపోవటం విశేషం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ