సైంటిఫిక్ థ్రిల్లర్ అందిస్తున్న విజయేంద్రప్రసాద్

August 26, 2015 | 04:40 PM | 1 Views
ప్రింట్ కామెంట్
vijayendraprasad_scientific_triller_niharonline

తెలుగులో ఎన్నో సినిమాలకు కథలు సమకూర్చిన విజయేంద్ర ప్రసాద్ డైరెక్టర్ కూడా. నాగార్జున నటించిన రాజన్న సినిమాకు దర్శకుడు విజయేంద్రప్రసాద్. ఈయన పేరు ఇటీవల వినిపించినంతగా అంతకు ముందు లేదనే చెప్పాలి. బాహుబలి సినిమా ప్రభావంతో ఈ రచయిత పేరూ బాగా వినిపిస్తోంది. కానీ నిజానికి ఈయన చాలా సినిమాలకు కథలు అందించారు. దర్శకుడిగా కూడా కొన్ని సినిమాలు చేశారు గానీ అంతగా పేరు రాలేదు. ఈయన ‘జానకిరాముడు, బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి,  సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు’ సహా ఎన్నో సూపర్ హిట్ మూవీస్ కి కథను అందించిన స్టార్ రైటర్. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ‘బాహుబలి’తో రచయితగానూ, ఈ ఏడాదినే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘భజరంగీ భాయ్ జాన్’ స్టోరీ రైటర్ గా బాలీవుడ్ కి కూడా తెలుగువాడికి ఖ్యాతి తెచ్చాడు. రచయితగానే కాకుండా విజయేంద్రప్రసాద్ ‘రాజన్న’ వంటి హిట్ చిత్రాన్ని డైరెక్టర్ గా చేశారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. రేష్మాస్(Reshma’s) ఆర్ట్స్ బ్యానర్ పై రాజ్ కుమార్ బృందావన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ర‌జ‌త్‌క‌ష్ణ‌, మిస్ ఇండియా నేహ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజ్ కుమార్ బృందావన్ మాట్లాడుతూ విజయేంద్ర ప్రసాద్ తో కలిసి మా బ్యానర్ లో సినిమా చేయడం చాలా హ్యపీగా ఉంది. చాలా డిఫరెంట్ పాయింట్ తో ఈ కథను విజయేంద్రప్రసాద్ గారు సిద్ధం చేశారు. కథ వినగానే వెంటనే సినిమా చేయడానికి రెడీ అయ్యాం. ప్రధానంగా ఈ చిత్రం ఒక సైంటిఫిక్ థ్రిల్లర్. ఇప్పటి వరకు మన తెలుగులో సైంటిఫిక్ చిత్రాలు వచ్చినప్పటికీ ఈ చిత్రం వాటన్నింటికంటే భిన్నంగా ఎక్సలెంట్ స్టోరీ, టేకింగ్ అండ్ మేకింగ్ లతో రూపుదిద్దుకుంటుంది. ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ