సినిమాలు సమాజంలో ప్రభావం చూపుతాయనే విషయాన్ని మరిచినట్లు ఉన్నారు. చిన్న ఎక్స్ పోజింగ్ సీన్ కనిపిస్తే కట్ చెప్పే సెన్సార్ బోర్టు ఇప్పుడు నిద్ర పోతుందా అన్న అనుమానం కలగక మానదు. ఓ సీరియల్ రేపిస్ట్ కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రంగా చెప్పుకొస్తున్న కీచక చిత్రమే దీనికి నిదర్శనం. బహుశా ఇంత వరకూ ఏ సినిమాలోనూ చూడని హింస ఇందులో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక మహిళను అత్యంత దారుణం గా హింసించడం, కిందపడేసి తొక్కడం, ఆపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేయటం, ఆపై దారుణంగా రేప్ చెయ్యటం. ఇంకో మహిళను సిగరెట్ తో కాల్చి హింసించటం, ఆపై అత్యాచారం చెయ్యటం. పదేళ్లు కూడా నిండని ఓ బాలిక ను పైశాచికంగా అత్యా చారం చెయ్యటం. ఇది కీచక సినిమా టీజర్ అంటూ ఆ చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది.
మొత్తం 15 రేపులంటూ సెన్సార్ నుంచి క్లియరెన్స్ తెచ్చుకుని మరీ ఈ చిత్రం విడుదలకు సిద్ధమౌతుంది. ఇక ఈ టీజర్ చూస్తుంటే అసలు సెన్సార్ బోర్డ్ ఏం చేస్తుందా అన్న సందేహం కలగక మానదు. యథార్థగాథ అంటూ దారుణమైన అకృత్యాలను జనాలను చూపే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాలు అనేవి సందేశాలు ఇవ్వకపోయినా ఫర్వాలేదుగానీ, నేర ప్రవృత్తిని పెంపోందించే విధంగా ఉంటే సమాజం పెడదోవ పట్టడం మాత్రం ఖాయం. సినిమాలు తీయాలంటే రేపిస్ట్ లది, శాడిస్ట్ లదే కాదు... దేశానికి సేవ చేసిన మహానుభావులు కూడా ఎంతో మంది ఉన్నారు. వారి జీవిత కథలను కూడా జనాలకు నచ్చేట్టు ఇంట్రస్టింగ్ గా తీయొచ్చు.