యాక్షన్ సీన్స్ కోసం విష్ణు స్పెషల్ ట్రైనింగ్

August 28, 2015 | 12:49 PM | 4 Views
ప్రింట్ కామెంట్
vishnu_dynamite_niharonline

డైనమైట్ పోస్టర్స్ చూస్తేనే ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ అనేది తెలిసిపోతోంది. అయితే ఇందులో మంచు విష్ణు యాక్షన్ సీన్స్ స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం చాలా కష్టపడ్డాడట. ఈ సినిమా కోసం మంచు విష్ణు స్పెషల్ గా తన బాడీని టోన్ చేసుకోవడమే కాకుండా యాక్షన్ ఎపిసోడ్స్ పై స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడట. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘డైనమైట్ లో కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ కోసమే 47 రోజులు కేటాయించాను. ఇద్దరు స్పెషల్ ట్రైనర్స్ ని పెట్టుకొని బాడీ ని టోన్ చేయడమే కాకుండా సినిమా కోసం 7కిలోల బరువు పెరిగాను. హాలీవుడ్ చిత్రాల స్థాయిలో కాకపోయిన హాలీవుడ్ స్టైల్ యాక్షన్ ఎపిసోడ్స్ మనమూ ట్రై చేయచ్చని ఇందులో ట్రై చేసాను. విజయన్ మాస్టర్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ఒళ్ళు జలదరించేలా ఉంటాయ’ని తెలిపాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని త్వరలోనే సెన్సార్ కి వెళ్లనున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం తమిళంలో విక్రమ్ ప్రభు, ప్రియ ఆనంద్ హీరో హీరోయిన్లు ఘన విజయం సాధించిన ‘అరిమ నంబి’కి రీమేక్. మంచు మోహన్ బాబు, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవకట్టా ఈ సినిమాకి దర్శకుడు. మంచు విష్ణు సరసన అందాల భామ ప ప్రణిత హీరోయిన్ గా నటించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ