సంపూ సినిమాకి విష్ణు డైలాగులు

November 24, 2014 | 01:20 PM | 32 Views
ప్రింట్ కామెంట్

నటుడిగా తనను తాను నిరూపించుకున్న మంచు విష్ణు ఇటీవల 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరిట నిర్మాణ సంస్థను నెలకొల్పి నిర్మాతగా కూడా విజయాలను అందుకుంటున్నాడు. ఇప్పుడి మంచు వారబ్బాయి కలం పట్టి డైలాగులు రాశాడని సమాచారం. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా ‘సింగం123’ అనే చిత్రాన్ని విష్ణు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పోలీస్ కథాంశాలతో వచ్చిన సినిమాలపై సెటైరిక్ గా రూపొందనున్న ఈ చిత్రానికి విష్ణు బీభత్సమైన కామెడీ డైలాగులను అందించాడట. ఈ డైలాగులు కచ్ఛితంగా తెరపై పేలుతాయని చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో ఉందట. సంపూ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అక్షత్ శర్మ అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నాడు. లోబడ్జెట్ సినిమాలతో కొత్త వాళ్లకి లైఫ్ ఇస్తున్న విష్ణు మరి తన డైలాగ్ లతో సంపూర్ణేష్ బాబుకు మాంచి హిట్ ఇస్తాడేమో చూద్దాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ