హీరోయిన్ పరిణీతి చోప్రా సినిమాల్లోనే కాదు.. చివరకు పబ్లిక్ ఫంక్షన్‌లోనూ రొమాంటిక్‌గా కనిపించేందుకు తహతహలాడుతోంది. ఎక్కడికి వెళ్లినా సరే హట్ హట్ దుస్తులతో అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి పిచ్చెక్కిస్తుంది. రీసెంట్ గా ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా బర్త్‌డే పార్టీలో కూడా సేమ్ సీన్ రిపీట్ చేసింది. ఆలీవ్ గ్రీన్‌ప్యాంట్ ధరించి హాజరైంది. టాప్‌పై బ్లాక్ కలర్ హార్ట్ షేప్ మాదిరిగా చేసిన డిజైన్ అందరినీ ఆకట్టుకుంది. కానీ, ఆ హార్ట్ షేప్ మధ్యలో అందాలు ఆరబోసినట్టుగా కనిపించింది. వాస్తవానికి అలా కనిపించాలనే ఈ విధంగా డ్రెస్ డిజైన్ చేసినట్టు ఈ పార్టీకి వచ్చినవాళ్లు చెబుతున్నారు. ఇప్పుడు ఈ స్టిల్స్ ఇంటర్నెట్‌లో నెటిజన్లను ఎట్రాక్ట్ చేసుకుంటున్నాయి. సినిమాల్లో ఎలాగూ అందాలు ఆరబోస్తోంది కదా, కనీసం బర్త్‌డే పార్టీలకైన పద్్రావాలా అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి ఈ పార్టీ కన్నా.. ఈమె వేసుకున్న డ్రెస్ ఇప్పుడు హైలెట్ అయ్యింది.