తెగ తిట్టుకోని తిరిగి సినిమానా?

December 19, 2014 | 12:52 PM | 22 Views
ప్రింట్ కామెంట్

టాలీవుడ్ లో నటుడు ప్రకాష్ రాజ్, దర్శకుడు శ్రీనువైట్ల మధ్య జరిగిన ఏ రేంజ్ లో గొడవలు జరిగాయో అందరికీ తెలుసు. ప్రెస్ మీట్ లు పెట్టి మరీ ఇద్దరు బాహాబాహీగా తిట్టేసుకున్నారు. ప్రకాష్ రాజ్ తో సినిమా చేసేది లేదని వైట్ల, శీను డైరక్షన్లో నటించేది లేదని ప్రకాశ్ కరాఖండిగా చెప్పేశారు. అయితే ఏం మ్యాజిక్ జరిగిందో తెలీదుకానీ వారిద్దరు కలిసి త్వరలో ఓ చిత్రం చేయబోతున్నారని తెలుస్తోంది. రాంచరణ్ తో త్వరలో శ్రీనువైట్ల ఓ చిత్రం తీయబోతున్నాడు కదా. అందులో ఓ కీలకపాత్ర కోసం ప్రకాష్ రాజ్ ను ఎంపికచేసినట్లు సమాచారం. మీడియా సాక్షిగా ఒకరిపైఒకరు దుమ్మెత్తి పోసుకోని ఇప్పుడు కలిసి చిత్రం చేయడమేంటని ఫిలింనగర్ అంతా ఆశ్చర్యపోతోంది. అయితే దీనంతటికి కారణం చిరంజీవేనని చెబుతున్నారు. గతంలో కృష్ణ వంశీ ప్రకాష్ రాజ్ మధ్య గొడవ జరిగినప్పుడు కూడా చిరంజీవే కల్పించుకోని వీరద్దరి మధ్య సయోధ్య జరిపి గొవిందుడు అందరివాడేలే చిత్రంలో నటించేలా చేశాడు. ఇప్పుడు కూడా అలానే వీరిద్దరి మధ్య మైత్రి కుదిర్చాడని టాలీవుడ్ టాక్. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలీయాలంటే చిత్రం పట్టాలెక్కెదాకా ఆగాల్సిందే. రాజకీయాల్లోనే కాదు సినీ పరిశ్రమలో కూడా బద్ధ శత్రువులు ఉండరనేది ఈ వ్యవహారం చూస్తే నిజం అనిపిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ