మహేష్ బాబు మురుగదాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఒకేసారి చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో మహేష్ బాబు బాలీవుడ్ లోకి మొదటి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చినట్టవుతుంది. ఇప్పటి వరకూ ఆయన సినిమాలు హిందీలోకి చాలానే డబ్బింగ్ అయినాయి. బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా తెలిసున్న హీరో మహేష్ బాబు. అయితే మహేష్ కు వాయిస్ ఎవరిస్తున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఇటీవలే మహేష్ సతీమణి నమ్రత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబుకు హిందీ బాగా వచ్చు అని చెప్పింది కూడా. అయినప్పటికీ ఈయనకు డబ్బింగ్ డబ్బింగ్ చెప్పించాలని అనుకుంటున్నారు మురుగదాస్.
ఇప్మపుడు హేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ అయిపోయిన తరువాత మురుగదాస్ చేయబోయే భారీ బడ్జెట్ సినిమాను మొదలు పెట్టనున్నారు. ఈ సినిమా హైకోర్టు నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. తమిళ వర్షన్ కు మహేష్ బాబు తనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడట. కానీ హిందీలో మహేష్ అంత స్పష్టంగా డబ్బింగ్ చెప్పలేడని అక్షయ్, అమీర్ ను సంప్రదించాలనుకుంటున్నారట. వీరితో మురుగదాస్ సినిమాలు చేయడంతో వీరిద్దరూ ఆయనకు మంచి స్నేహితులు. ఈయనకు డబ్బింగ్ ఎవరు చెప్పబోతున్నారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ సినిమాను ఏప్రిల్ 12న ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.