రోజా హీరోకి బాగా ఎక్కేసింది

November 27, 2015 | 11:12 AM | 3 Views
ప్రింట్ కామెంట్
aravind-swamy-thani-oruvan-remake-telugu-niharonline

బ్రూస్ లీ అట్టర్ ఫ్లాప్ అవటంతో రాంచరణ్ తన తదుపరి చిత్రం కోసం బాగా కేర్ తీసుకుంటున్నాడు. తమిళంలో ఘన విజయం సాధించిన తని ఒరువన్ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన స్క్రిప్టు పనులు పక్కాగా చేయమని దర్శకుడు సురేందర్ రెడ్డికి చెర్రీ సూచించాడట. అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ చిత్రంలో కీలకమైన విలన్ పాత్రకు సస్పెన్స్ నెలకొంది. ఎంతో మందిని అనుకున్నప్పటికీ ఇంకా ఎవరినీ ఫైనలైజ్ చేయలేదు. అయితే మాతృకలో విలన్ గా నటించిన అరవింద్ స్వామినే తెలుగు వర్షన్ కి ఒప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

                                 నిజానికి ఆ చిత్రంలో హీరో జయం రవి పాత్ర కన్నా విలన్ అరవింద్ స్వామి పాత్రకే ఇంపార్టెంట్ ఎక్కువ. ఆ పాత్ర కోసం ఎంత మందిని అనుకున్నా సెట్ కాకపోవటంతో, దీంతో ఎలాగైనా తిరిగి అరవింద్ స్వామినే విలన్ గా నటించాలని అల్లు అరవింద్ సంప్రదించాడట. ఇందుకోసం 5 కోట్ల పారితోషికం ఇస్తామని చెప్పినా ఆయన ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే ఒకే పాత్రలో మరోసారి నటించడం తనకి ఇష్టం ఉండదని అరవింద్ స్వామి చెప్పినట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ అరవిందుని ఒప్పించేందుకు  ఈ అరవిందుడు  ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నాడని సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ