లోఫర్ దెబ్బకి బంపరాఫర్ మిస్సయ్యింది

December 18, 2015 | 02:34 PM | 3 Views
ప్రింట్ కామెంట్
akhil-dropped-from-Puri-project-niharonline

వీడు లోఫర్... అంటూ వరుణ్ తేజ్ ని థియేటర్లకు వదిలాడు డైరక్టర్ పూరీ జగన్నాథ్. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలున్నప్పటికీ డల్ స్క్రీన్ ప్లే, సెకండాఫ్ దెబ్బడిపోవటంతో సినిమాపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. దీంతో కలెక్షన్లకు భారీగానే దెబ్బపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్ర ఫలితంతో దర్శకుడు పూరీ మరో లక్కీ ఛాన్స్ ను కూడా మిస్సయినట్లు సమాచారం.

                        మాస్ డైరక్టర్ వినాయక్ దర్శకత్వంలో అఖిల్ అంటూ వచ్చాడు అక్కినేని అఖిల్. అయితే ఎంట్రీ గ్రాండ్ గా ఉన్నప్పటికీ చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో అఖిల్ సెకండ్ ఫ్రాజెక్ట్ విషయంలో ఆచీతూచీ అడుగేయాలని చూస్తున్నాడు కింగ్ నాగ్. ఆ మధ్య అఖిల్ రెండో చిత్రం పూరీతో ఉంటుందనే హింట్ ఇచ్చాడు. అయితే లోఫర్ రిజల్డ్ మీదనే ఈ అవకాశం ఆధారపడి ఉంటుందని కూడా చెప్పాడట. సరేనన్న పూరీ అఖిల్ తో సినిమా కోసం కథ తయారు చేయించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు లోఫర్ ఫలితం తేడా కొట్టడంతో నాగ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అల్లుడి శీను ఫ్లాప్ అయినప్పటికీ వినాయక్ కి భారీ పారితోషకం ఇచ్చి అఖిల్ తీయించి భంగపడ్డ నాగ్ మళ్లీ అలాంటి పొరపాటు చేయొద్దని డిసైడ్ అయ్యాడట. అందుకే పూరీ తో ప్రాజెక్టును పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. అఖిల్ స్కిల్స్ ను ఫుల్లుగా వాడుకుని సాలిడ్ హిట్ ఇచ్చే దర్శకుడి కోసం ప్రస్తుతం కింగ్ అన్వేషణలో ఉన్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ