ధోనీకి షాకిచ్చిన అనంతపురం కోర్టు

January 08, 2016 | 12:13 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Dhoni-lord-vishnu-case-anantapur-court-non-bailable-warrant-niharonline

భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మరింత గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే టెస్టు కెరీర్ కు గుడ్ బై చెప్పిన ‘విన్నింగ్ టీం’ కెప్టెన్, తాను ఆడుతున్న పరిమిత ఓవర్ల క్రికెట్ లోనూ అంతగా రాణించలేకపోతున్నాడు. ఈ క్రమంలో ధోనీకి రిటైర్మెంట్ టైం దగ్గరపడిందన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఇదే సమయంలో అతడికి మరో షాకిస్తూ ఏపీలోని అనంతపురం జిల్లా కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.

              వాణిజ్య ప్రకటనల్లో భాగంగా గతంలో అతడు దేవతలను అవమానించాడని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన అనంతపురం కోర్టు అతడికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ఇండియా టుడే అనుబంధ సంచిక బిజినెస్ టుడేలో 2013 ఏప్రిల్ నెల సంచికలో ధోనీని విష్ణుమూర్తిగా చిత్రీకరిస్తూ ప్రచురించారు. విష్ణుమూర్తిని అనుకరిస్తూ అష్ట బాహువులలో కాళ్లకు వేసుకునే బూట్లను, చిప్స్ ప్యాకెట్‌ను, ఇంజన్ ఆయిల్ డబ్బాను, సెల్‌ఫోన్‌ను, కూల్‌డ్రింక్స్ వంటి వాటిని పట్టుకున్నట్లు అందులో వేశారు. దేవుడి స్థానంలో ధోనిని ఉంచి వ్యాపార ఉత్పత్తులను పెంచుకోవాలని చూడడం హిందుత్వాన్ని మంటగలపడమేనని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) అప్పట్లో కేసు నమోదు చేసింది. దీనిపై రెండున్నరేళ్లుగా విచారణ సాగిన అనంతరం వచ్చే నెల 25 తమ ముందు హాజరుకావాలని ఆ వారెంట్లలో అతడిని ఆదేశించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ