పనిపిల్లను క్రూరంగా హింసించి... పరారయ్యాడు

September 08, 2015 | 04:40 PM | 2 Views
ప్రింట్ కామెంట్
shahadat-hossain-assault-case-11-year-old-servant-niharonline.jpg

అభం శుభం తెలియని ఓ అమ్మాయిని క్రూరంగా హింసించి కేసులో ఇరుకున్నారు బంగ్లాదేశ్ క్రికెటర్ షాహదత్ హుస్సేన్. అతని భార్య న్రిట్టో హుస్సేన్ తో కలిసి షాహదత్ ఇంట్లో పనిచేసే ఓ 11ఏండ్ల బాలిక( మహుఫ్జా అక్తర్ హ్యాపీ) ను వేధించాడు. తన ఒంటిపై తీవ్రమైన దెబ్బలతో ఆదివారం ఢాకాలోని ఓ వీధిలో మహుఫ్జా ఏడుస్తూ వెళ్తుండగా, అది గమనించిన పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను క్రికెటర్ షాహదత్ ఇంట్లో పనిచేస్తున్నానని, అతను భార్యతో కలిసి తనను తీవ్రంగా కొట్టారని ఆ అమ్మాయి చెప్పడంతో ఆమెను వెంటనే ఆస్పత్రిలో చేర్చించి, కేసు నమోదు చేశారు పోలీసులు. క్రికెటర్‌ను అరెస్టు చేయడానికి ఇంటికి వెళ్లగా షాహదత్, అతని భార్య ఇంట్లో లేరని తెలిసింది. సోమవారం ఉదయాన్నే మరోసారి అక్కడికి వెళ్లినా, ఇంటికి తాళం వేసే ఉందని పోలీసులు తెలిపారు. కెరీర్లో 38 టెస్టులు, 51 వన్డేలాడిన షాహదత్, గాయంతో మొన్నటి భారత్, దక్షిణాఫ్రికా సిరీస్‌లకు దూరమయ్యాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతగాడి కోసం పోలీసులు గాలింపు జరుపుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ