భారీ ఆధిక్యంలో టీమిండియా

December 05, 2015 | 05:43 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Kohli_Rahane_lift_Indias_lead_to_403_niharonline

చివరి టెస్టులో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. మూడో రోజు ముగిసే సమయానికి 403 పరుగుల ఆధిక్యత సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 10 ఫోర్ల సాయంతో 83 పరుగులు సాధించి సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో రహానే... రెండో ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ బాదాడు. 5 ఫోర్ల సాయంతో 52 పరుగులతో కోహ్లీకి మంచి సహకారం అందిస్తున్నాడు. వీరిద్దరి వికెట్లను పడగొట్టడానికి దక్షిణాఫ్రికా బౌలర్లు చేసిన యత్నాలు ఫలించలేదు.

అంతకు ముందు, మురళీ విజయ్ 3, ధావన్ 21, రోహిత్ శర్మ 0, పుజారా 28 పరుగులు చేసి ఔటయ్యారు. మోర్కెల్ 3 వికెట్లు పడగొట్టగా, ఇమ్రాన్ తాహిర్ ఒక వికెట్ తీశాడు. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. 403 పరుగుల ఆధిక్యత ఉన్నప్పటికీ కెప్టెన్ కోహ్లీ ఇంకా డిక్లేర్ చేయలేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ