జడేజా మాయతో గెలుపు దిశగా భారత్

December 04, 2015 | 05:38 PM | 1 Views
ప్రింట్ కామెంట్
south-africa-all-out-for-121-in-delhi-test-niharonline

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి రెండు రోజులు టీమిండియా ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం చలాయించారు. యువ కెరటం జడేజా స్పిన్ దెబ్బకు సఫారీలు కుదేలయ్యారు. 49.3 ఓవర్లు ఆడిన సౌతాఫ్రికా జట్టు 121 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ఆలౌటయ్యారు. తొలి రోజు ఓపికగా ఆడి 231 పరుగులతో తొలి రోజు ఆటముగించిన టీమిండియా రెండో రోజు రెండు సెషన్లు బ్యాటింగ్ చేసి విజయానికి సరపడా స్కోరును ప్రత్యర్థి ముందుంచి తొలి ఇన్నింగ్స్ ముగించింది. రహానే అద్భుతమైన ఆటతీరుతో సెంచరీ సాధించగా, అర్ధ సెంచరీతో అశ్విన్ సఫారీ బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. దీంతో టీమిండియా 334 పరుగులను స్కోరు బోర్డుమీద ఉంచింది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికాను రవీంద్ర జడేజా, అశ్విన్, ఉమేష్ యాదవ్ ముప్పతిప్పులు పెట్టారు. గింగిరాలు తిరిగే బంతులతో సఫారీ బ్యాట్స్ మన్ ను ముప్ప తిప్పలు పెట్టిన రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీసి టీమిండియా విజయానికి బాటలు వేయగా, అతనికి ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ చెరి రెండు వికెట్లు తీసి చక్కని సహకారమందించారు.

                           ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీయడం విశేషం. సౌతాఫ్రికా ఆటగాళ్లలో వన్డే కెప్టెన్ డివిలియర్స్ (42) రాణించగా, బవుమా (22), ఎల్గర్ (17), విలాస్ (11) రెండంకెల స్కోరు చేయగలిగారు. కెప్టెన్ ఆమ్లా (3), డుప్లెసిస్ (0), డుమిని (1), అబోట్ (4), పిడిట్ (5), తాహిర్ (1) దారుణంగా విఫలమయ్యారు. మోర్కెల్ (9) నాటౌట్ గా నిలిచాడు. దీంతో టీమిండియాకు 213 పరుగుల ఆధిక్యం లభించింది. దీంతో నాలుగో టెస్టులో విజయానికి చేరువగా వచ్చింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ