ఇప్పట్లో రిటైర్మెంట్ కాను కానీ...

January 06, 2016 | 12:41 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Mahendra Singh Dhoni Mum on Retirement Plans

ఫేవలమైన ఫామ్ తో టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ... ఆసీస్ పర్యటన తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ (వన్డే) నుంచి కూడా రిటైర్ అవుతాడన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఆసీస్ పర్యటనకు బయలుదేరే ముందు ముంబైలో స్వయంగా మహీనే రిటైర్మెంట్ వార్తలను కొట్టిపారేశాడు. తన రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని అతడు పేర్కొన్నాడు. సీనియర్లలో ఆట ఇంకా మిగిలే ఉంది. తమ సత్తాను తక్కువగా అంచనా వేయకండి. ప్రస్తుతం తన దృష్టి అంతా ఆసీస్ టూర్, టీ20 వరల్డ్ కప్ పైనేనని అతడు ప్రకటించాడు. అయితే సమయమొచ్చినప్పుడు మాత్రం పొట్టి క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటానని ధోనీ స్పష్టం చేశాడు. అది టీ20 వరల్డ్ కప్ తర్వాతనే కాబోలు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ