కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానున్న భారత్-పాకిస్థాన్ టీ20 మ్యాచ్ కు ఎలాంటి అడ్డంకులు లేవని గ్రౌండ్స్ మెన్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీమిండియా-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. పొడిగా ఉన్న కోల్ కతాలో అకస్మాత్తుగా తన ప్రతాపం చూపడం ప్రారంభించాడు. దీంతో నేటి ఉదయం నుంచి కోల్ కతాను చిరుజల్లులు పలకరించాయి. స్టేడియంను పట్టణాన్ని చిత్తడి చేశాయి. దీంతో మ్యాచ్ నిర్వహణపై సందేహాలు ముసురుకున్నాయి. అయితే గ్రౌండ్స్ మెన్ మ్యాచ్ నిర్వహణకు ఎలాంటి అడ్డంకి లేదని తేల్చడంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది.
కాగా మ్యాచ్ కోసం పాక్ లోని ప్రధాన పట్టణమైన పెషావర్ లో సినిమా హాళ్లలో షోలు రద్దు చేసి మరీ క్రికెట్ లైవ్ ఏర్పాట్లు చేసుకున్నారు. యువతను దృష్టిలో పెట్టుకుని మరిన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యాచ్ వీక్షణకు టికెట్ ను 100 పాక్ రూపాయలుగా నిర్ణయించారు. ధియేటర్ల బయట పోస్టర్లు, బ్యానర్లు పెట్టిమరీ ప్రచారం చేస్తున్నారు.