స్పిన్ మ్యాజిక్: గెలుపు దిశగా భారత్

November 07, 2015 | 03:33 PM | 2 Views
ప్రింట్ కామెంట్
ravindra-jadeja-smashes-safari-with-spin-in-mohali-test-niharonline

బంతి మ్యాజిక్ పనిచేస్తున్న వేళ,  బ్యాట్స్ మెన్ బెంబేలెత్తిపోవటంతో మొహాలీ టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకుపోతోంది. 218 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా టీమిండియా స్పిన్నర్ల ధాటికి విలవిల్లాడుతోంది. పేక ముక్కల్లా మన ఇన్నింగ్స్ కూలిపోతే, దానికి ఏ మాత్రం తీసిపోమంటూ సఫారీ బ్యాట్స్ మెన్లు క్యూ కట్టేస్తున్నారు. కేవలం 102 కే 8 వికెట్లు కూలి ప్రస్తుతం ఓటమి అంచున ఉంది. స్టెయిన్ 0 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. రవీంద్ర తన స్పిన్ మ్యాజిక్ 4 వికెట్లు రాల్చగా, అశ్విన్ 2, మిశ్రా, ఆరోన్ లు చెరో వికెట్ తీశారు. సౌత్ ఆఫ్రికా గెలవాలంటే మరో 116 పరుగులు చేయాలి. టీమిండియా గెలవాలంటే టెయిలెండర్లను పెవిలియన్ పంపితే చాలు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ