చేసింది తక్కవ స్కోరే అయినా చెన్నై మ్యాజిక్ చేసింది. ప్రత్యర్థి ఊపు చూసి పరాజయం తప్పదనుకున్నరంతా.. అయినా ట్విస్ట్ లతో చెన్నై విజయాన్ని కైవసం చేసుకుంది. ఐపీఎల్ 8 లో భాగంగా చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా చెన్నై ను నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 134 పరుగులకే కట్టడి చేసింది. ఇక ఇదంతా చూసిన అభిమానులు చెన్నై కి ఓటమి తప్పదనుకున్నారు. ఇక తక్కువ టార్గెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన కొల్ కతా రెండో బంతికే గంభీర్ డకౌట్ అయ్యాడు. 16 ఓవర్ తర్వాత వరుసగా మూడు డకౌట్లతో మొత్తం ఐదు వికెట్లను చెన్నై బౌలర్లు కూల్చారు. ఓపెనర్ రాబిన్ ఊతప్ప (39) శుభారంభాన్నే ఇచ్చిన మిగిలిన వారు బాళ్లను మింగటంతో చివర్లో ఉత్కంఠ నెలకొంది. చివరి ఓవరికి 19 బంతులు అవసరమవగా తొలి రెండు బంతులకు రెండు పరుగులు రాగా, చివరి బ్యాట్స్ మెన్ చివరి మూడు బంతులకు 6,4,4బాదారు. అయినప్పటికీ రెండు పరుగుల తేడాతో కొల్ కతా ఓటమిపాలైంది.