చిన్నజట్టుపై చిన్న లక్ష్యం... హ్యాట్రిక్ విక్టరీ కొట్టిన భారత్

February 28, 2015 | 04:56 PM | 67 Views
ప్రింట్ కామెంట్
india_hattrick_win_in_worldcup_niharonline

చిన్న జట్టు పైగా స్వల్ఫ లక్ష్యం వెరసి పెర్త్‌ వేదికగా శనివారం యూఏఈ తో జరిగిన మ్యాచ్ లో భారత్‌ విజయం సాధించింది. యుఏఈ నిర్ధేశించిన 102 పరుగుల చిన్న లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి (ధావన్ 14) అలవోకగా నెగ్గింది. రోహిత్ శర్మ (57) అర్థసెంచరీతో రాణించగా, కోహ్లీ 33 పరుగులతో అతనికి జతకలిశాడు. మహ్మద్ నవీద్ కి ఒక వికెట్ లభించింది. ఇక అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన యూఏఈ 31.3 ఓవర్లలో 102 పరుగులకు అలౌట్ అయింది. అశ్విన్ 4 వికెట్లు తీసి యూఏఈ నడ్డి విరిచాడు. ఇతనికి తోడుగా రవీంద్ర జడేజా 2 , ఉమేష్ యాదవ్ 2, మోహిత్ శర్మ, భువనేశ్వర్ లు తలో వికెట్ తీశారు. ఈ విజయంతో హ్యాట్రిక్ విజయం సాధించిన భారత్ క్వార్టర్స్ లోకి ప్రవేశించే మార్గాన్ని సులువుతరం చేసుకుంది. అంతేకాదు వరల్డ్ కప్ చరిత్రలో మొదటిసారిగా వరుసగా మూడు మ్యాచ్ లు నెగ్గింది. ఇక భారత్ తన తదుపరి మ్యాచ్ మార్చి 6న వెస్టిండీస్ తో తలపడనుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ