ఆండ్రాయిడ్ తో నోకియా ఫోన్లు

May 19, 2016 | 03:49 PM | 9 Views
ప్రింట్ కామెంట్
Nokia-relaunched-with-Android-version-niharonline

ఐదేళ్ల క్రితం దాకా ఒక్క మన దేశమే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల మొబైల్ వినియోగదారుల నోట ఒకటే మాట... నోకియా అని. ఫిన్ ల్యాండ్ కు చెందిన ఈ టెక్నాలజీ దిగ్గజం ‘కనెక్టింగ్ పీపుల్’ ట్యాగ్ లైన్ తో ప్రవేశపెట్టిన మొబైల్ ఫోన్లకు అప్పట్లో భయంకరమైన క్రేజ్ ఉండేది . 1998 నుంచి 2011 దాకా ప్రపంచ స్థాయి విక్రయాల్లో నోకియా ఫోన్లదే హవా. అన్ని మొబైల్ కంపెనీల్లోకి నోకియానే అగ్రగామి. అయితే శామ్ సంగ్, స్మార్ట్ ఫోన్ల ఎంట్రీతో నోకియాకు ఒక్కసారిగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అంతే నోకియా కోలుకోలేకపోయింది.

                                   2014లో తన మొబైల్ ఫోన్ల తయారీని సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కు విక్రయించింది. మైక్రోసాఫ్ట్ తో నోకియా బ్రాండ్ ఒప్పందం వచ్చే నెలాఖరుకు ముగియనుంది. దీంతో గత వైభవాన్ని కొనసాగించాలనుకుంటున్న నోకియా మళ్లీ రంగప్రవేశం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ తో బ్రాండ్ ఒప్పందం ముగియగానే  ఫిన్ ల్యాండ్ కే చెందిన కొత్త కంపెనీ ‘హెచ్ఎండీ గ్లోబల్’కు తన బ్రాండ్ ను ఇచ్చేయనుంది. నోకియా పేరిట మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేయడంతో పాటు విశ్వవ్యాప్తంగా విక్రయించుకునేందుకు హెచ్ఎండీ గ్లోబల్ కు నోకియా అనుమతి ఇచ్చేసింది. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. గతానుభవనాలను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే మార్కెట్ లోకి రానున్న నోకియా ఫోన్లను హెచ్ఎండీ గ్లోబల్ ఈసారి ఆండ్రాయిడ్ ప్లాట్ ఫామ్ తో రానుందట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ