ఉట్టికెగరలేనమ్మ...ఆకాశానికెగిరిందట...

September 18, 2015 | 05:03 PM | 5 Views
ప్రింట్ కామెంట్
Small_jet_niharonline

విమానం ఎక్కాలని అనుకో తప్పులేదు. కానీ... విమానాన్నే దోచేయలనుకుంటే... తన వద్ద కేవలం ఒక చేతి కర్ర మాత్రమే ఉందట. ఆ కర్ర సాయంతో విమానాన్నే తస్కరించబోయాడట. అసలు విషయమేంటంటే ఓ దొంగ అమెరికాలోని ఓ వ్యాపారవేత్త జెట్ విమానాన్ని దోచేయలనుకున్నాడు. ఇది గురువారం నాడు వాకో రీజనల్  ఎయిర్ పోర్టులో జరిగింది. చిన్న జెట్ విమానానికి అడ్డంగా ఉన్న టైర్ చౌక్ లను తొలగించి  విమానాన్ని దొంగిలించే ప్రయత్నంలో విమానాశ్రయ సిబ్బంది చేతుల్లో చిక్కాడు ఈ విచిత్ర దొంగ. మానసిక ఇబ్బందులకు లోనై ఇందుకు పాల్పడినట్లు ఆరా తీసిన సిబ్బందికి తెలిపాడు ఆ దొంగ. ఈ వ్యక్తిని మానసిక ఆరోగ్య అంచనాల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ల సూచన అందిన తరువాత ఇతనిపై కేసు దర్యాప్తు చేయనున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ