వైద్యో నారాయణో హరి

December 03, 2015 | 02:33 PM | 1 Views
ప్రింట్ కామెంట్
yem-chrin-Cambodia-doctor-infected-hiv-virus-200-people

పూజలు అందుకుని ప్రతిఫలం అందిచని దేవుడి కన్నా తన చాకచక్యంతో ప్రాణాలు కాపాడే డాక్టర్ నే దేవుడిలా భావించి ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు. అలాంటి వైద్య వృత్తికి మచ్చ తెచ్చేలా వ్యవహారించాడో  వ్యక్తి ఇక్కడ. వైద్యుడిగా చెలామణి అయి చేయకూడని తప్పు చేశాడు. ప్రతిఫలంగా 200మందికి పైగా ఎయిడ్స్ వ్యాపింపజేసి ఘోరమైన పాపం చేశాడు. ఈ మహా తప్పిదం చేసినందుకు గురువారం కంబోడియా కోర్టు ఆ నీచుడికి 25 ఏళ్ల కారాగార శిక్షను విధించింది.

అసలు అతగాడి కథేంటంటే... బట్టామాబాంగ్ ప్రావిన్స్ లోని రోఖా అనే గ్రామీణ తెగకు వైద్యుడిగా వచ్చిన యెమ్ చరిన్ (57) వచ్చి రాని వైద్యంతో డబ్బుసంపాధించడం మరిగాడు. ఈ క్రమంలో అతడు దాదాపు 200మందికి పైగా ఎయిడ్స్ రావడానికి కారణమయ్యాడు. వారిలో పదిమందికి పైగా ఇప్పటికే చనిపోయారు కూడా. దీంతో అతడిని గత ఏడాది పోలీసులు అరెస్టు చేశారు. ఒకరికి ఉపయోగించిన సిరంజీని మరొకరికి ఉపయోగించిన కారణంగా 200మందికి పైగా ఎయిడ్స్ సోకింది. వీరంతా కూడా 15 నుంచి 49ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే. ఇతడికి 25 ఏళ్ల జైలు శిక్షను విధించడంతోపాటు భారీ మొత్తంలో ఫైన్ కూడా వేశారు. ఈ వృత్తిని చేపట్టిన ఆ వైద్యుడికి లైసెన్సు కూడా లేకపోవటంతో ఆరోగ్యశాఖపై కోర్టు ఆగ్రహాం వెలిబుచ్చింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ