ఉత్తరభారతంతోపాటు రెండు దేశాల్లో భారీ ప్రకంపనలు

December 26, 2015 | 11:21 AM | 1 Views
ప్రింట్ కామెంట్
Earthquake_in_Afghanistan_Pak_shakes_Delhi_rest_of_north_India_niharonline

తరచు భూ ప్రకంపనలతో వణికిపోతున్న ఉత్తరావని మరోసారి ఉలిక్కిపడింది. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ లలో శుక్రవారం అర్థరాత్రి దాటాక పెను భూకంపం సంభవించింది. సుమారు 6.4, 6.9 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపాల ధాటికి ఉత్తర భారతం వణికిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ సహా చండీగఢ్, జైపూర్ తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. నడిరాత్రి ఉన్నట్లుండి భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

                                       తొలుత అఫ్ఘన్ లో 6.4 తీవ్రతతో సంభవించిన భూకంప కేంద్రం హిందూకుష్ పర్వతాల్లో ఉన్నట్లు అమెరికా జియలాజికల్ సంస్థ పేర్కొంది. ఈ భూకంపం కారణంగా పెద్దగా నష్టం జరిగినట్లు దాఖలా లేదు. మరికాసేపటికే పాక్ ఆక్రమిత కాశ్మీర్ (ఆజాద్ కాశ్మీర్)లోనూ 6.9 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా 30 మందికి గాయాలయ్యాయి. వీరందరికి పెషావర్ లోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ భూకంపం నేపథ్యంలో పాక్ లోని పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఉత్తర భారతదేశంతోపాటు ఈశాన్య రాష్ట్రాల అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ