లిఫ్ట్ లో ప్రయాణిస్తున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన భారతీయుడు సత్తయ్య ఇళయరాజాకు సింగపూర్ కోర్టు 9 నెలల జైలు శిక్ష విధించింది. గత నెల 7వ తేదీన ఓ అపార్ట్ మెంట్ లోని లిఫ్ట్ లో తనతో ప్రయాణిస్తున్న మహిళ పట్ల మద్యం మత్తులో ఉన్న సత్తయ్య అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె లిఫ్ట్ లో నుంచి బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు సత్తయ్యను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. వాదోపవాదాలు విన్న కోర్టు నిందితుడు సత్తయ్య ఇళయరాజాకు 9 నెలల జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించినట్టు స్ట్రెయిట్స్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.