ఆ ఊర్లో ఉగ్ర అరాచకం ఎలా జరిగిందంటే?

December 17, 2015 | 12:34 PM | 3 Views
ప్రింట్ కామెంట్
ISIS-sinjar-koche-destroyed-niharonline

ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు. పేరు చెబితేనే అగ్రరాజ్యాలతోసహా ప్రపంచం మొత్తం వణికిపోతుంది. రాజమౌళి బాహుబలిలో రాక్షస గణం కాళకేయుల ఆరాచకాల గురించి చెబుతుంటే వెన్నులో ఎలా వణుకు పుడుతుందో ప్రస్తుతం ఐఎస్ చేసే పనులు అంతకన్నా దారుణంగా ఉంటున్నాయి. పసిపిల్లలు, వృద్ధులు అని చూడకుండా ఘోరాలకు పాల్పడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారీ ఉగ్ర రాక్షసులు. పరిస్థితి ఎలా ఉందంటే వారి ధాటికి ఊర్లకు ఊర్లే ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. ఇక ప్రస్తుతం గతంలో వీరు చేసిన దారుణాలు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి.

2014 ఆగస్టు 3న ఇరాక్ లోని సింజార్ పర్వత శ్రేణుల్లోని కొచో గ్రామం. హఠాత్తుగా గ్రామంపై దాడిచేశారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు గ్రామంలో ఉన్నవారందరినీ మైదానంలోకి రావాలని హెచ్చరికలు జారీ చేశారు. తమ బారి నుంచి ఎవరూ తప్పించుకోలేరని, స్వచ్చందంగా బయటకు వస్తే ఎవరినీ ఏమీ చేయమని హామీ ఇచ్చారు. దీంతో పిల్లాపాప అనే తేడా లేకుండా అంతా మైదానం చేరుకున్నారు. పురుషులు, స్త్రీలు వేర్వేరుగా విడిపోవాలని సూచించారు. 350 మంది పురుషులను సింజార్ పర్వతాలకు తీసుకెళ్తున్నట్టు తెలిపారు. అనంతరం వారిని గ్రామ శివారుల్లోని పంటపొలాల్లో వరుసగా నిలబెట్టి కాల్చేశారు. మహిళలలో వృద్ధులను వేరు చేశారు. అలా 80 మంది వృద్ధులను సజీవ సమాధి చేశారు. అనంతరం తమతోపాటు యువతులు, మహిళలను తీసుకెళ్లి లైంగిక వాంఛలను తీర్చుకుని అమ్మేశారు. ఈ ప్రాంతాన్ని ఇటీవల కుర్దు బలగాలు కనుగొనగా ఈ దారుణం వెలుగు చూసిందట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ