లైఫ్ ఆప్ పై హీరోకి రియల్ కష్టాలు

December 23, 2015 | 12:53 PM | 2 Views
ప్రింట్ కామెంట్
life-of-pie-tiger-tortured-by-trainer-niharonline

ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు అందుకోవటమే కాదు అస్కార్ బరిలో సత్తా చాటిన చిత్రం 'లైఫ్ ఆఫ్ పై'.  సముద్ర ప్రయాణంలో సర్వం కోల్పోయిన ఓ యువకుడు ఓ పులితో కడదాకా చేసే పడవ ప్రయాణమే ఈ చిత్రకథ. జీవితంలో ఎన్నికష్టాలు ఎదురైనా అది చేరాల్సిన చోటుకే చేరుతుంది అన్న ఫిలాసఫీని బేస్ చేసుకుని ఆంగ్‌ లీ  అనే హాలీవుడ్ దర్శకుడు అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ కళాఖండాన్ని తెరకెక్కించాడు. భారతీయ నటులైన ఇర్ఫాన్ ఖాన్, టబూ వంటి వారు ఇందులో ప్రముఖ పాత్రలు పోషించారు. అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కించిన ఈ సినిమాలో రిచర్డ్ పార్కర్ గా యునో అనే ఓ పులి నటించి అందరినీ మెప్పించింది. ప్రధాన పాత్రధారి పై పటేల్ తో సమాన పాత్రను పోషించి అందరిచేత కంటతడిపెట్టించిన ఆ పులి ఇప్పుడు ఎన్నో కష్టాలను అనుభవిస్తోంది.  సంరక్షకుడే దాని పాలిట కాలయముడిగా మారి హింసకు గురి చేస్తున్నాడు.

                 కెనడాలోని ఒంటారియోలో గల ఓ జూలో ఆ పులి ఉంటోంది. మిచెల్ హాకెన్ బర్గర్ అనే పెద్ద మనిషి సొంతంగా ఆ జూపార్క్ ను నడుపుతున్నాడు. జంతువులకు ట్రైనింగ్ ఇవ్వడంలో దిట్ట అని అతనికి పేరుప్రఖ్యాతులు కూడా ఉన్నాయి. లైఫ్ ఆఫ్ పై లో నటించిన యునో (పులి అసలు పేరు)కు కూడా ఆయనే శిక్షణ ఇచ్చాడు. అయితే మొదటి నుంచి కూడా ఆయన యూనోను హింసిస్తూనే ఉన్నాడుట. ప్రఖ్యాత జంతు సంరక్షణ సంస్థ 'పెటా' ఇందుకు సంబంధించి ఓ రహస్య వీడియోను చిత్రీకరించింది. యునోను పదేపదే కొరడాతో కొడుతూ, పచ్చి బూతులు తిడుతుండటం వీడియోలో రికార్డ్ అయింది. ఇంకో విషయం ఏమిటంటే... "పులి నోటిపై, కాళ్లపై కొడితే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది" అని ఆ రాక్షసుడు మాట్లాడే మాటలు వీడియోలు స్పష్టంగా వినిపించాయి కూడా. ఇక ఈ వీడియోను ఆధారంగా చేసుకుని అతనిపై ఫిర్యాదు చేసేందుకు పెటా సిద్ధమైపోతుంది. సినిమాలోనే నటనతోనే మెప్పించిన యునోను కష్టాల చెర నుంచి విముక్తి కలిగించాలని అభిమానులంతా సోషల్ మీడియాలో కోరుకుంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ