ఆ మహమ్మారికి మందు మలేరియానే!!

October 15, 2015 | 03:43 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Malaria-vaccine-research-may-lead-to-cure-for-cancer

ముళ్లును ముళ్లుతోనే తియ్యాలని ఓ సామెత ఉంటుంది. అయితే అది అన్ని చోట్లా పనిచేస్తుందన్నది మాత్రం చాలా మంది ఒప్పుకోరు. కానీ, ఇప్పుడు అదే నిజమని నిరూపించారు శాస్త్రవేత్తలు. ప్రజల ప్రాణాలను హరిస్తున్న మహమ్మారి క్యాన్సర్ కు చికిత్స దిశగా అతిపెద్ద విజయాన్ని వారిప్పుడు సాధించారు. అయితే అనుకోకుండా వారు కనుగొన్న ఓ ఆయుధం కేన్సర్ పై పోరాడేందుకు అత్యంత కీలకంగా మారనుంది. అదే మలేరియా వ్యాధి.

కేన్సర్ ను మలేరియా క్రిమిని వ్యాపింపజేసే ఓ రకమైన పాజిటివ్ ప్రొటీన్ ఓడిస్తున్నదని డానిష్ రీసెర్చర్ల బృందం కనిపెట్టింది. మలేరియా బారి నుంచి గర్భిణీ స్త్రీలను రక్షించడంపై పరిశోధనలు చేస్తున్న వీరు... ఆ ప్రొటీన్, క్యాన్సర్ పై పోరాడుతున్నదని గుర్తించారు. మలేరియా వాక్సిన్ లోనే ఈ ప్రొటీన్లున్నాయని, వీటిని మరింతగా శక్తిమంతం చేసే మార్గాలను అన్వేషించాల్సి వుందని సైంటిస్టులు చెబుతున్నారు. గర్భాశయంలోని మాయ పెరుగుదల, క్యాన్సర్ కణితి పెరుగుదల మధ్య ఉన్న సారూప్యతలపై శోధిస్తున్నామని, దీనిలో విజయం సాధిస్తే, క్యాన్సర్ నాశన ఔషధం తయారైనట్టేనని కోపెన్ హాగెన్ వర్శిటీ సైంటిస్టు అలీ సలాంటి నమ్మకంగా చెబుతున్నారు.

వచ్చే నాలుగేళ్లలో మలేరియా ప్రొటీన్ ఔషధాన్ని క్యాన్సర్ ఉన్న మానవులపై ప్రయోగాత్మకంగా వాడవచ్చని భావిస్తుట్టు వివరించారు. "ఇప్పటికే మేము కార్బోహైడ్రేట్ లతో కలిసుండే మలేరియా ప్రొటీన్ ను వేరు చేశాం. దీనికి కొంత టాక్సిన్ లను కలిపాము. చుంచులపై పరీక్షలు చేస్తే, ప్రొటీన్, టాక్సిన్ ల మిశ్రమం క్యాన్సర్ కణాలను చంపేసింది" అని కెనడాలోని బ్రిటీష్ కొలంబియా యూనివర్శిటీ రీసెర్చర్ మాడ్స్ డుగ్గార్డ్ వివరించారు. రోగానికి రోగమే మందు అని వీరు నిరూపిస్తే మాత్రం వైద్యచరిత్రలో ఇదో వింతగా మిగిలిపోవటం ఖాయం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ