అమ్మనే అయ్యానురా నీ రాకతో... తల్లీ బిడ్డల అనుబంధం అంతో ఇంతో కాదు ఈ విషయం తెలిసిందే కదా... అసలు విషయం ఏంటంటే... అమెరికాలోని ఉత్తర కరోలినాలోని షెల్లీ అనే మహిళ సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ తరువాత షెల్లీ ఆరోగ్యం విషమించి కోమాలోకి వెళ్లిపోయింది. డాక్టర్లు సాయ శక్తులా కృషి చేసినప్పటికీ, ఆమెను స్పృహలోకి తేవడంలో విఫలమయ్యారు. ఇక ఆమెకు మరణిస్తుందని డాక్టర్లు నిర్దారించుకున్నారు. చటుక్కున ఒక ఆలోచన డాక్టర్లకు తట్టింది. ఇంకేం తల్లీ బిడ్డల మధ్య ఉండే స్పర్శానుభూతుల వల్ల లాభం ఉంటుందనుకుని బిడ్డను తల్లి అక్కున చేర్చి గుండెలపై పడుకోబెట్టారు.. పాపను నెమ్మదిగా గిల్లడంతో ఏడవడం ప్రారంభిచిన పాప ఏడుపు విన్న కాసేపట్లోనే షెల్లీ కోమా నుండి బయటపడింది. తనకు తానుగా బిడ్డను చేతుల్లోకి తీసుకుని ముద్దాడింది.