ఉత్తరాదిని వణికించిన భారీ భూకంపం

October 26, 2015 | 04:19 PM | 1 Views
ప్రింట్ కామెంట్
afghanistan_pakistan_india_earth_quake_niharonline

భారీ భూకంపంతో దేశ రాజధాని ఢిల్లీ మరోసారి వణికిపోయింది. సోమవారం మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో హిందుకుష్ పర్వత ప్రాంతాలు కేంద్రంగా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదవ్వగా, దీని తీవ్రత ఎక్కువగానే ఉంది. కాబూల్ సహా, పాకిస్థాన్ లోని పలు నగరాల నుంచి వస్తున్న వార్తల ప్రకారం, ఇప్పటివరకూ 11 మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఆఫ్గన్ లో నష్టం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో, చాలా భవనాలు నాని ఉన్నాయని, ముఖ్యంగా మట్టితో నిర్మించుకున్న ఇళ్లు కూలిపోయాయని తెలుస్తోంది. ఆఫ్గనిస్థాన్ లోని జార్మ్ ప్రాంతానికి 28 మైళ్ల దూరంలో పర్వతాల నడుమ భూకంప కేంద్రం నమోదైందని అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్ లోని లాహోర్, పెషావర్ లతో పాటు ఖైబర్ ఫక్తుంక్వా ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించింది.

ఇక ఉత్తర భారతదేశంలో కశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు ఈ ప్రకంపనలు ప్రభావం చూపించాయి. ఢిల్లీతోపాటు హర్యానా, జైపూర్, భోపాల్ ప్రాంతాలు కూడా ప్రకంపించాయి. ఇక ఢిల్లీ మెట్రో సర్వీస్ లను తాత్కాలికంగా నిలిపేశారు. మందీ హౌజ్ మెట్రో స్టేషన్ నుంచి ప్రయాణికులు బయటికి పరుగులు పెట్టారు. 30 సెకన్లపాటు భూమి కంపించటంతో జనాలంతా ఇల్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం సృష్టించిన నష్టం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ