నిజమా? పాక్ తాలిబన్ చీఫ్ చచ్చాడా?

December 20, 2014 | 03:29 PM | 31 Views
ప్రింట్ కామెంట్

కర్కషంగా 148 మంది పిల్లలను పొట్టన బెట్టుకున్న పాక్ తాలిబన్ పై సైన్యం ప్రతీకారం తీర్చకుందా?. అవుననంటున్నాయి పాక్ ప్రభుత్వ వర్గాలు. తాము చేపట్టిన ఉమ్మడి దాడుల్లో 59 మంది తాలిబన్లతోపాటు పాక్ తాలిబన్ చీఫ్ మౌలానా ఫజులుల్లా కూడా మరణించినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాక్ తాను తీసిన గోయ్యిలో తానే పడ్డట్లు, వారి ప్రోత్సాహం పొందిన తాలిబన్ల చేతిలో అభం శుభం తెలియని చిన్నారులు బలయ్యేలా చేసుకుంది. ఇన్నాళ్లు వారిపట్ల కిక్కురుమనకుండా ఉన్న సైన్యం ఈ సంఘటనతో ప్రతీకారం పెంచుకుంది. అంతేకాదు అందుకే ఏకంగా పెద్దతలకే స్పాట్ పెట్టి ఏసేసిందని సమాచారం. ఈ వార్తను పాక్ ప్రభుత్వం ఇంకా ధ్రువీకరించాల్సిన అవసరం ఉంది. కాగా, మరోవైపు రాజకీయ నేతల పిల్లలను టార్గెట్ చేసి చంపుతామని పాక్ తాలిబన్ సంస్థ నుంచి ఓ లేఖ అందినట్లు సమాచారం. దీంతో ఆ దేశంలోని నేతల ఇంటివద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ