వింత: టెర్రరిస్ట్ గ్రూప్ ల మధ్య ట్వీట్ల వార్

November 21, 2015 | 05:29 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Al Qaeda-ISIS-rivalry-tweets-niharonline

ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న రెండు ఉగ్రవాద సంస్థల మధ్య మాటల యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది. అవును... ప్రస్తుతం అగ్రరాజ్యలతోసహా అన్ని దేశాలను వణికిస్తున్న ఆల్ ఖైదా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఈ రెండు సంస్థలు కలిసిపోయే ప్రమాదం ఉందని గత కొంత కాలంగా వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఆల్ ఖైదా అనుబంధ సంస్థగా వెలసిన ఐఎస్ఐఎస్ తరువాత ఆల్ ఖైదాతో విభేదించి, వేరు కుంపటి పెట్టుకుని, ప్రబల శక్తిగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమాయకులైన ప్రజలను పొట్టన పెట్టుకోవడంపై సోషల్ మీడియాలో కామెంట్లు చేసుకుంటూ తమ సామర్థ్యం చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు.

                                   మాలి ఉగ్రవాద ఘటన నేపథ్యంలో మరోసారి ఈ రెండు ఉగ్రవాద సంస్థలకు చెందిన ఫైటర్ల మధ్య ఆసక్తికర సంవాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మాలి దాడుల నుంచి ఐఎస్ఐఎస్ పాఠాలు నేర్చుకోవాలని ఆల్ ఖైదా మద్దతు దారు సూచించాడు. దీనికి కారణం, మాలి దాడుల్లో ఉగ్రవాదులు, ఖురాన్ లోని పంక్తులు చెప్పిన వారిని విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. దీనిని ఉద్దేశిస్తూ ఆ వ్యాఖ్య చేసినట్టు నిపుణులు భావిస్తున్నారు. ఐఎస్ఐఎస్ వ్యూహాలు సరైనవి కాదని ఆయన తప్పుపట్టారు. అలాగే అల్లాహు ఆలం పేరిట ఉన్న యూజర్ మాలి తరహా దాడులు ఐఎస్ఐఎస్ కు చేతకాదని దెప్పిపొడిచాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ